నడకతో నగరంపై అవగాహన

16 Sep, 2019 08:46 IST|Sakshi

నడకతో నగరంపై అవగాహన సిటీలో నయా ట్రెండ్‌కు నాంది 

నెట్టింట్లో ఈవెంట్ల సమాచారం విషయ సేకరణకు ఎంతో దోహదం

సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకునే వీలు

చారిత్రక కట్టడాలపై అవగాహన  

ఆసక్తి కనబరుస్తున్న వాకర్స్‌  

శోభన.. ఉద్యోగరీత్యా చెన్నై నుంచి హైదరాబాద్‌కి బదిలీపై వచ్చింది. నగరానికి వచ్చి కొన్ని వారాలు గడిచినా.. పనులు, వసతి ఏర్పాట్లలో తలమునకలైంది. ఆమెకు స్నేహితులు ఎక్కువ మంది లేకపోవటంతో పనులు తెమలక మరింత ఇబ్బంది పడేది. సోషల్‌ మీడియా బ్రౌజ్‌ చేస్తుండగా సిటీలోని ప్రముఖ ప్రాంతంలో వాక్‌ నిర్వహిస్తున్నారనే సమాచారం కంటపడింది.  వెళితే కొంచెం రిఫ్రెషింగ్‌ ఉంటుందనే తలంపుతో అందులో పాల్గొంది. వాక్‌లో నగర పరిచయంతో పాటు తనలాంటి మైండ్‌సెట్‌ ఉన్న మిత్రులు ఆమెకు పరిచయమయ్యారు.  ఇంకేముంది. ఇప్పడు శోభనకి సిటీ అంతా పరిచయమైంది. కొత్త ప్రాంతంగా అనిపించట్లేదు.  నగరంలోని చారిత్రక ప్రాంతాలు, పార్కులు, మార్కెట్‌లు,ఆలయాలు ఇలా పలు వాక్‌లలో పాలుపంచుకుంది. హైదరాబాద్‌ని తెలుసుకుంటూ, తన సిటీగా ఫీల్‌ అవుతోంది. కొత్తగా వచ్చిన వారికే కాదు.. నగరవాసులకు సైతం ఈ వాక్‌లు సిటీ ప్రాముఖ్యతనుపరిచయం చేస్తున్నాయి. ఒక రకంగా ఇది ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. నగర చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, ప్రత్యేకతలు తెలుసుకోవడానికి ఇంతకంటే చక్కటి మార్గం లేదంటున్నారు వాకర్స్‌. నగరం గురించి కొత్తవారికి తెలియజెప్పడంలో ఆనందం ఉందంటున్నారు వాక్‌ లీడర్స్‌.ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రెండ్‌గా మారిన వాక్‌లను ఆయా సంస్థలు, కొంతమంది వ్యక్తిగతంగా కూడా నిర్వహిస్తున్నారు. సంస్థలైనా వ్యక్తులైనా సోషల్‌ మీడియా వేదికగా తమ ఈవెంట్లను ప్రమోట్‌ చేసుకుంటున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో ఈ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. హైదరాబాద్‌కు సంబంధించిన ఫేస్‌బుక్, మీటప్‌ పేజీల్లో ఈ సమాచారం లభిస్తోంది.   

కేవలం ‘వాక్‌’నే కాదు.. 
ఇక వాక్‌ అంటే అలా కాసేపు సరదాగా నడిచి వచ్చేయటం కాదు. హెరిటేజ్‌ వాక్‌ అయితే ఆ కట్టడం నిర్మాణ శైలి నుంచి మొదలు నిర్మించిన వ్యక్తి, ఆ కట్టడానికి సంబంధించిన పూర్తి చరిత్ర తెలియచేస్తారు. ఇక బజార్‌లు, పండగ రోజుల్లో నిర్వహించే వాక్‌లలో ఆ ప్రాంతంలో ఏ వస్తువులు దొరుకుతాయి, ఆ ప్రాంతం ప్రాముఖ్యతలు, ప్రముఖ ఘట్టాలు ఇలా అన్ని వివరిస్తారు. పార్క్‌లు, టూంబ్స్, ప్యాలెస్‌లు, కోటలు, పురాతన భవనాలు, గ్రంథాలయాలు, చర్చిలు, నాటి బజార్లు, నగరానికి దగ్గరలో ఉన్న కొండలు, గుట్టలు, అడవులు, జలాశయాలు ఇలా మన ఆసక్తిని బట్టి ఆయా వాక్‌లను ఎంచుకోవచ్చు. 

ఎన్నో రకాలు..

చార్మినార్, ట్యాంక్‌బండ్, గోల్గొండ, కుతుబ్‌షాహీ టూంబ్స్, పురానాపూల్, మొజంజాహీ మార్కెట్, చౌమహల్లా ప్యాలెస్, అమీన్‌పురా చెరువు, వికారాబాద్‌ ఫారెస్ట్, మౌలాలి గుట్ట, ఇలా నగరంలోని ఎన్నో ప్రాంతాల్లో అనేక వాక్‌లు నిత్యం నిర్వహిస్తూనే ఉంటారు. దసరా, రంజాన్, క్రిస్‌మస్‌ లాంటి పండగ సమయాల్లోనూ  వాటికి సంబంధించిన వాక్‌లు నిర్వహిస్తుంటారు.  వీటిలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, స్కెచ్చింగ్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వాక్‌లు కూడా ఉంటాయి. ఈ వాక్‌లలో పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. వీటిలో ఆయా వ్యక్తులు, సంస్థలను బట్టి ఫీజులున్నాయి. వాక్‌ నిర్వాహకులు ఈ వివరాలను ముందే తెలియజేస్తారు. 

ఎంతో ఆనందం..నేను
హైదరాబాదీని. అధ్యాపక వృత్తిలో ఉన్నాను. నగరానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివాను. దాదాపు నగరంలో ఉన్న అన్ని చారిత్రక కట్టడాలు, ప్రాంతాల గురించి తెలుసు. నగరానికి కొత్తగా వచ్చే అనేక మంది మిత్రులుకు విద్యార్థులకు సిటీ గురించి చాలా విషయాలు తెలియజేస్తుంటాను. ఆసక్తి ఉన్న వారికి వాటి గురించి తెలియజేయటంలో మరింత ఆనందం కలుగుతుంది. ఇప్పటి వరకు ఇండియా హెరిటేజ్‌ వాక్స్‌ వారి తరఫున సాలార్జంగ్‌ మ్యూజియం, మొజాంజాహీ మార్కెట్‌ ఇలా పలు వాక్స్‌ నిర్వహించాను.          – మహమ్మద్‌ అబ్దుల్‌ నయీం,    వాక్‌ లీడర్‌ 

చాలా విషయాలు తెలుస్తాయి..
నాకు సిటీలో ఉండే డిఫరెంట్‌ ఫుడ్‌ టేస్ట్‌ చెయ్యాలంటే ఇష్టం. నాస్తా ఏ సుబాహ్‌ అనే ఈవెంట్‌ గురించి ఫేస్‌బుక్‌లో చూశాను. అబిడ్స్‌లో టేస్టీ టిఫిన్‌ సెంటర్స్‌లో ఫుడ్‌ టేస్ట్‌ చేశాను. సెంటర్‌ ఆఫ్‌ సిటీలో తక్కువ ధరకు ఇంత మంచి ఫుడ్‌ దొరుకుతుందని ఈ వాక్‌ వల్లే తెలిసింది. ఫస్ట్‌ టైం వెళ్లాను. ఫుడ్‌ అంటే ఇష్టమున్న వాళ్లని కలుసుకున్నా.             – చందనశ్రేయ, వాకర్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫిట్‌ ఫంక్షన్‌

బీజేపీలోకి అన్నపూర్ణమ్మ!

టిక్‌టాక్‌.. షాక్‌

ఐఆర్‌సీటీసీ వింటర్‌ టూర్స్‌

బాత్రూంలో బడి బియ్యం

ఘనపూర్‌ ప్రాజెక్ట్‌ మారని రూపురేఖలు

ట్రూజెట్‌ విమానంలో సాంకేతిక లోపం

ఈ–సిగరెట్స్‌పై తొలి కేసు

సోలిపేట రామలింగారెడ్డికి రెండోసారి

బీజేపీకి పూర్వవైభవం తీసుకొస్తాం

గట్టు.. లోగుట్టు! 

కింగ్‌..ట్రాఫిక్‌ వింగ్‌

నేటి నుంచి బతుకమ్మ కానుకలు 

మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు..

దేవుడా.. ఎంతపనిజేస్తివి! 

పల్లెల్లో ‘క్రిషి’

ఆ పైసలేవీ?

వర్షం @ 6 సెం.మీ

మంత్రివర్యా.. నిధులివ్వరూ! 

పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్‌ ఓవైసీ

కేంద్రం ఇచ్చింది.. 31,802 కోట్లే

కొత్త మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ తెస్తాం

అప్పులు 3 లక్షల కోట్లు

బార్‌ లైసెన్సుల అనుమతి పొడిగింపు 

తీరొక్క కోక.. అందుకోండిక!

రూ. 45,770 కోట్లు  తప్పనిసరి ఖర్చు

ఎయిర్‌ పోర్ట్‌కు 25 నిమిషాల్లో జర్నీ..

9... నెమ్మది!

సంక్షేమం స్లో...

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

డేట్‌ ఫిక్స్‌ చేసిన అల్లు అర్జున్‌?

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌