వేగం పెరగాలి.. 

3 May, 2019 13:22 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రైసు మిలర్ల వివాదం సమసిపోవడంతో రబీ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. రబీ ధాన్యం ఇప్పుడిప్పుడే కొనుగోలు కేంద్రాలకు చేరుతుండగా... రా రైస్‌ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం(సీఎంఆర్‌) కింద ధాన్యం తీసుకునేందుకు నిరాకరించారు. ఈ మేరకు శుక్రవారం నుంచి సహాయ నిరాకరణకు రైసుమిల్లర్ల సంఘం పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పౌరసరఫరాలశాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌ రెడ్డి రైస్‌ మిల్లర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నేతలతో గురువారం జరిపిన చర్చలు ఫలించాయి. రా రైస్‌ విషయంలో ఏర్పడిన సమస్యలను వారం, పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సహాయ నిరాకరణను విరమించుకున్నట్లు ప్రకటించిన మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూడాలని, రైతులు పడిగాపులు కాచే పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రబీ కొనుగోళ్లలో వేగం పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

613 కొనుగోలు కేంద్రాలు, 5.04 లక్షల మెట్రిక్‌ టన్నులు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం ఆధారంగా ఈ సీజన్‌లో 5,04,602 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 613 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు  చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. గురువారం నాటికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 538 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అ«ధికారులు ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ సంస్థల ద్వారా 1,17,289 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 63 కేంద్రాల ద్వారా 63,665 మె.టన్నులు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 95 కేంద్రాల ద్వారా 22,406, జయశంకర్‌ భూపాలపల్లి (ములుగు జిల్లా కలిపి) జిల్లాలో 239 కేంద్రాల ద్వారా 33,507, మహబూబాబాద్‌లో 69 కేంద్రాల ద్వారా 14,250, జనగామ జిల్లాలో 72 కేంద్రాల ద్వారా 23,465 మె.టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 5,04,602 మె.టన్నుల లక్ష్యానికి 1,17,289 మె.టన్నులు (23.24 శాతం) ధాన్యాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయంలో మరింత స్పీడ్‌ పెంచాలని గురువారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించిన పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డాక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ అధికారులను ఆదేశించారు.

రేషన్‌షాపులు, కొనుగోలు కేంద్రాల పరిశీలన
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం పర్యటించిన పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డాక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ కొనుగోలు కేంద్రాలు, రేషన్‌ దుకాణాలను పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి ఉదయమే హన్మకొండకు చేరుకున్న ఆయన పోలీస్‌ గెస్ట్‌హౌజ్‌లో ఆబ్కారీ, ప్రొహిబిష¯Œన్, పౌరసరఫరాల శాఖ, డీఆర్‌డీఏ అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ధర్మసాగర్‌ మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన రైతులతో మాట్లాడారు. తేమ గుర్తింపు విధానం, యంత్రాల పనితీరుపై ఆరా తీశారు.

ఇక కాజీపేట మండలం బాపూజీనగర్‌లోని 12వ నెంబర్‌ చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. అనంతరం  కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, నీడ, టార్పాలిన్లు, తూకం, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేయాలని లీగల్‌ మెట్రాలజీ అధికారులకు స్పష్టం చేశారు. అక్కడక్కడా తేమ పేరున తూకాలలో తగ్గింపులు జరుపుతున్నట్లు విమర్శలపై దృష్టి సారించాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హుండీ ఎత్తుకెళ్లిన దొంగల అరెస్ట్‌

డమ్మీ గన్‌తో పోలీసులనే బెదిరించి..!

ఈనాటి ముఖ్యాంశాలు

పబ్లిక్‌లో ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు..

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

ఫిలింనగర్‌లో దారుణం..

జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య

ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు..

మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ మృతి

‘మున్సిపల్‌’లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు

బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే రాజకీయ సునామీనే..

‘టిక్‌టాక్‌’ ఓ మాయ ప్రపంచం

అంత డబ్బు మా దగ్గర్లేదు..

సందిగ్ధం వీడేనా? 

కిరోసిన్‌ కట్‌

గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి భౌతికకాయం

కమలంలో కోల్డ్‌వార్‌ 

మున్సిపల్‌ ఎన్నికలు జరిగేనా..?

వరంగల్‌లో దళారీ దందా

మెట్రో రూట్లో ఊడిపడుతున్న విడిభాగాలు..

‘నగర’ దరహాసం

పాతబస్తీ పరవశం

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో గుబులు..

ఎఫ్‌ఎన్‌సీసీలో జిమ్‌ ప్రారంభం

హైదరాబాద్‌లో కాస్ట్‌లీ బ్రాండ్లపై మక్కువ..

తెలంగాణ సంస్కృతి, ఎంతో ఇష్టం

మాజీ ఎంపీ వివేక్‌ పార్టీ మార్పుపై కొత్త ట్విస్ట్‌!

గ్యాస్‌ ఉంటే.. కిరోసిన్‌ కట్‌..!

మరింత కిక్కు..! 

ఉమ్మడి జిల్లాపై ‘జైపాల్‌’ చెరగని ముద్ర 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు