పన్నుల వసూళ్లలో వరంగల్‌ ముందంజ

19 Apr, 2018 17:00 IST|Sakshi
కమర్షియల్‌ ట్యాక్స్‌ డీసీ గీత

2017–18కి రూ.431కోట్లు

మార్చి నెల 2018లోనే    రూ. 56.32 కోట్ల వసూలు

కమర్షియల్‌ ట్యాక్స్‌ డీసీ గీత వెల్లడి

కరీమాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డివిజన్ల కన్నా వాణిజ్య పన్నుల వసూళ్లలో వరంగల్‌ డివిజన్‌ ముందంజలో ఉందని కమర్షియల్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌(డీసీ) గీత బుధవారం వెల్లడించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలోని మొత్తం 11 సర్కిళ్లలో మార్చి 2018 నాటికి మొత్తం 21044 మంది డీలర్స్‌ ఉండగా వీరిలో 15948 మంది గతంలో జీఎస్టీలోకి మైగ్రేషన్‌ అయ్యారన్నారు. కొత్తగా 5096 మంది గత జులై నుంచి ఈ మార్చి వరకు జీఎస్టీలో మైగ్రేట్‌ అయినట్లు డీసీ గీత వివరించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది(2018–18)కి ఎక్కువ పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు.

ప్రధానంగా 2017–18 సంవత్సరానికి గాను రాబడి రూ.431 కోట్లు వచ్చినట్లు తెలిపారు. కేవలం ఈ మార్చి 2018 వరకు రూ. 56.32 కోట్ల పన్నులు వసూలు చేసినట్లు డీసీ గీత వివరించారు. అలాగే 2017–18 సంవత్సరానికి గాను పాత బకాయిలు రూ.13.6 కోట్లు వసూలు చేశామన్నారు. ఇక జులై 2017 నుంచి మార్చి 2018 వరకు 81 శాతం జీఎస్టీ రిటర్న్‌ ఫైల్‌ చేయించినట్లు డీసీ పేర్కొన్నారు. పన్నుల వసూళ్లలో వరంగల్‌ డివిజన్‌ వాణిజ్య పన్నులు శాఖా సిబ్బంది ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు