మార్కెట్‌ కార్యదర్శి ఆకస్మిక తనిఖీ

30 Mar, 2018 11:12 IST|Sakshi
దొరికిన బస్తాలను కాంటావేస్తున్న కార్యదర్శి, అధికారులు

మిర్చి యార్డులో చిల్లర దొంగల ఆటకట్టు

1.38 క్వింటాళ్ల మిర్చి పట్టివేత

వరంగల్‌ సిటీ : వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి పొలెపాక నిర్మల గురువారం మిర్చి యార్డును ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యదర్శిని చూడగానే చిల్లర దొంగలు దొంగలించిన మిర్చి బస్తాలను వదిలివేసి పారిపోయారు. అప్పటికి సెక్యూరిటీ గార్డులు అందుబాటులో లేకపోయో సరికి కార్యదర్శినే స్వ యంగా దొంగ బస్తాలను యార్డులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న యార్డు ఇంచార్జీలు జన్ను భాస్కర్, బీ.వెంకన్న, సెక్యూరిటీ గార్డులు కార్యదర్శి వద్దకు చేరుకొని తనిఖీలో పాల్గొన్నారు.అనంతరం యార్డు ఏఎస్‌.వేముల వెంకటేశ్వర్లు దగ్గరుండి కార్యదర్శికి సహకరిస్తూ..చిల్లర దందాగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు సరిగా విధులు నిర్వర్తించడం లేదని కార్యదర్శి వారిపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి చిల్లర దొంగలు, వ్యాపారులు మిర్చి దందా చేస్తున్నట్లు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. బస్తాలు దొరికిన చిల్లర దొంగలు తమ బస్తాలను తీసుకెళ్లడానికి వివిధ రకాలుగా ఫైరవీలు చేసినా కార్యదర్శి ససేమీరా ఒప్పుకోలేదు. తనిఖీలో స్వా« దీనం చేసుకున్న 1.38 క్వింటాళ్ల మిర్చిని యార్డులోనే అమ్మి, మార్కెట్‌ ఫీజు కింద జమచేశారు.
రైతులను ఇబ్బంది పెడితే సహించం..
మార్కెట్‌కు మిర్చి అమ్మకానికి వచ్చిన రైతులను మునీమ్, దానం, దయ పేరుతో  మిర్చిని తీసుకోవడానికి ఇబ్బంది పెడితే సహించేదిలేదని మార్కెట్‌ కార్యదర్శి పి.నిర్మల హమాలీ కార్మికులను హెచ్చరించారు. గురువారం మిర్చి మార్కెట్లో కార్యదర్శి అకస్మిక తనిఖీ నిర్వహించిన సమయంలో కొందరు హమాలీల వద్ద చిల్లర మిర్చి బస్తాలను గుర్తించిన కార్యదర్శి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. హమాలీలు సక్రమంగా డ్యూటీ చేయాలని, లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు