సభా కమిటీల్లో మనోళ్లు!

24 Sep, 2019 11:41 IST|Sakshi

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్థానం

ఉమ్మడి జిల్లాలో పలువురికి అవకాశం కల్పించిన సీఎం

సాక్షి , వరంగల్‌: సభా కమిటీల్లో వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులకు అవకాశం దక్కింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో సభా కమిటీల్లోను ఓరుగల్లుకు పెద్దపీట వేయనున్నట్లు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున ఉమ్మడి సభా కమిటీలను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఆయా కమిటీల వివరాలిలా ఉన్నాయి.

 •  జోనల్‌ రైల్వే యూజర్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ సర్వీస్‌ మెంబర్‌ : నన్నపనేని నరేందర్‌ (వరంగల్‌ తూర్పు)

అసెంబ్లీ కమిటీలు

 •  రూల్స్‌ కమిటీ సభ్యుడిగా గండ్ర వెంకటరమణరెడ్డి(భూపాలపల్లి)
 •  ప్రివిలేజ్‌ కమిటీ సభ్యుడిగా డాక్టర్‌ టి.రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్‌)
 •  కమిటీ అన్‌ గవర్నమెంట్‌ అక్యూరెన్స్‌ సభ్యుడిగా చల్లా ధర్మారెడ్డి (పరకాల)

ఫైనాన్షియల్‌ కమిటీలు

 •  పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిలుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి(నర్సంపేట), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ)
 •  కమిటీ ఆన్‌ ఎస్టిమేట్స్‌ సభ్యుడిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(జనగామ)
 •  కమిటీ ఆన్‌ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ సభ్యుడిగా బానోతు శంకర్‌నాయక్‌(మహబూబాబాద్‌)

లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ కమిటీలు

 •  రూల్స్‌ కమిటీ సభ్యుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ)
 •  పిటీషన్స్‌ కమిటీ సభ్యుడిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(స్థానిక సంస్థల ఎమ్మెల్సీ)

వెల్ఫేర్‌ అండ్‌ అదర్‌ జాయింట్‌ కమిటీలు

 •  అమెనిటీస్‌ కమిటీ సభ్యులుగా దాస్యం వినయ్‌భాస్కర్‌(వరంగల్‌ పశ్చిమ), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ)
 •  వెల్ఫేర్‌ ఆఫ్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ కమిటీ సభ్యులుగా ధనసరి అనసూయ(ములుగు)
 •  వెల్ఫేర్‌  ఆఫ్‌ షెడ్యూల్‌ ట్రైబ్స్‌ సభ్యుడిగా బానోతు శంకర్‌నాయక్‌(మహబూబాబాద్‌)
 •  వెల్ఫేర్‌ ఆఫ్‌ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ సభ్యుడిగా నన్నపనేని నరేందర్‌(వరంగల్‌ తూర్పు), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (స్థానిక సంస్థల ఎమ్మెల్సీ)
 •  లైబ్రరీ కమిటీ సభ్యులుగా చల్లా ధర్మారెడ్డి (పరకాల), ధనపరి అనసూయ(ములుగు) 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా