రింగ్‌రోడ్డు సంగతేంది

15 Oct, 2014 03:30 IST|Sakshi
రింగ్‌రోడ్డు సంగతేంది
  • వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి
  • పలు సమస్యలపై అధికారుల నిలదీత
  • వాడివేడిగా ‘కుడా’ సమీక్ష సమావేశం
  • సాక్షి, హన్మకొండ :  రింగురోడ్డు అలైన్‌మెంట్ లో మార్పులు చేయాలని సూచించినా... ఎందుకు సకాలంలో స్పందించడం లేదంటూ  కార్పొరేషన్ అధికారులపై ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం ప్రశ్నించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే పనుల్లో  ఐఏఎస్ అధికారి ముద్ర స్పష్టంగా కనిపించాలన్నారు. తొలి సమావేశం కావడంతో కేవలం సూచనలకే పరిమితమవుతున్నామని, ఇవి మలి సమావేశం కల్లా అమలు కావాలన్నారు.

    కాకతీయ నగరాభివృద్ధి సంస్థ, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పనితీరుపై హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది.  ఉదయం 11 నుంచి మధ్యామ్నాం 2:30 గంటల వరకు జరిగిన సమావేశానికి ఎంపీ కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేష్‌తో పాటు కలెక్టర్ గంగాధర కిషన్, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సువర్ణా పండదాస్ ఇతర అధికారులు హాజరయ్యారు.

    వరంగల్ నగరం చుట్టూ నిర్మించనున్న రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పుపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. గతంలో రూపొందించిన మార్గంలో మార్పులు చేయాలని సూచించి నా... ఇంతవరకు ఆ పని ఎందుకు చేయలేదం టూ ఎంపీ కడియం శ్రీహరి అధికారులను నిల దీ ్డశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అలైన్‌మెంట్‌ను అంగీకరిస్తే జరిగే నష్టానికి ఎవరు బాధ్యులని, కీలకమైన అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండడం మానుకోవాలని అధికారులకు సూచించారు.

    సామాన్యులకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వంపై భారం పడకుండా రింగురోడ్డు మార్గంలో వెంటనే మార్పులు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్‌గా శాలినిమిశ్రా పని చేసిన కాలంలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందంటూ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారని గుర్తు చేశారు. అదేవిధంగా సువర్ణపండాదాస్ హయూంలో వరంగల్ న గరంలో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారనే పేరు వచ్చేలా పని చేయాలన్నారు.  
     
    మంచినీటిపై దృష్టి పెట్టాలి

    నగర ప్రజల మంచినీటి అవసరాలకు 2.5 టీ ఎంసీల నీరు అవసరం... భద్రకాళి, వడ్డేపల్లి, ధర్మసాగర్ చెరువుల ద్వారా ప్రస్తుతం 1.7 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉం ది... దీంతో ఏడాదిలో వంద రోజుల పాటు నీ టికి కొరత ఏర్పడుతుందని..దీన్ని నివారిం చేందుకు ఒక టీఎంసీ నీటి  నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నగరంలో చెత్త ఎక్కడిక్కడే పేరుకుపోతున్నదని, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు.

    మొదటి సమావేశం కాబట్టి అధికారులను ఏమనడం లేదని.. రా బోయే సమావేశం నాటికి ఈ సమస్యలను పరి ష్కరించాలని సూచించారు. ఈ క్రమంలో కలెక్టర్ జి.కిషన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలనిఅడిషనల్ కమిషనర్ శంకర్‌కు సూచించారు. పారిశుద్ధ్యం , పచ్చదనంపై బా ధ్యతలను డివిజన్ అధికారులకు అప్పగించామన్నారు. వేయిస్తంభాల గుడి అభివృద్ధిలో భా గంగా ఆలయం చుట్టూ వంద మీటర్ల వరకు భూమిని సేకరించే పనిని వేగవంతం చేయాల ని ‘కుడా’ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
     
    ఇది కూడా మేమే చెప్పాలా...

    బాలసముద్రంలోని ఏకశిల పార్కులో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ విగ్రహం చీకట్లో ఉంది... కనీసం ఇక్కడ లైటు ఏర్పాటు చేయాలన్న ధ్యాస కూడా కార్పొరేషన్ సిబ్బందికి లేదు... పబ్లిక్‌గార్డెన్ కళావిహీనంగా మారింది... పచ్చదనం తగ్గిపోయింది... బల్లలు పాడయ్యాయి. టౌన్‌హాల్ పరిస్థితీ అలానే ఉంది... మ్యూజికల్ గార్డెన్ అసలు ఉందా, లేదా అనే పరిస్థితి ఉంది... ఇలాంటి చిన్నచిన్న విషయాలు సైతం తాుమే చెప్పాలా.. అధికారులకు తెలియవా  అంటూ వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రశ్నల వర్షం కురిపించారు.  కేయూ జంక్షన్‌ను జయశంకర్ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని, ఇప్పటికైనా కమిషనర్ నగరంలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవాలని వారు పలు సూచనలు చేశారు.
     
    అధ్వానస్థితిలో విలీన గ్రామాలు

    వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనమైన 42 గ్రామాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఈ గ్రామాల్లో పాలన పూర్తిగా స్తంభించిందన్నారు. ఇక్కడ రోడ్లు, మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నా... అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అంతకుముందు కడియం శ్రీహరి మాట్లాడుతూ అదాలత్ సెంటర్ నుంచి నాయుడు పెట్రోల్‌ంపు వరకు నిర్మించిన రోడ్డు నాసిరకంగా ఉందన్నారు. దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. నగర పరిధిలో అన్ని రోడ్లు పాడయ్యాయని, దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు.
     

మరిన్ని వార్తలు