ఓరుగల్లు సిగలో స్మార్ట్ కిరీటం

2 May, 2015 01:44 IST|Sakshi
ఓరుగల్లు సిగలో స్మార్ట్ కిరీటం

ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
అత్యుత్తమ నగరాల సరసన వరంగల్
కేంద్ర నిధులు రూ.70 కోట్లు వచ్చే అవకాశం
మారనున్న నగర రూపరేఖలు
{sాఫిక్, విద్యుత్ కష్టాలకు చెక్
ఎకోఫ్రెండ్లీ సిటీగా రూపాంతరం
{పజాప్రతినిధులు, నగర వాసుల హర్షం

 
 ఓరుగల్లుకు అరుదైన గౌరవం దక్కింది. స్మార్ట్ సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 నగరాల్లో తొలి విడత జాబితాలో చోటు సంపాదించింది. ఇక ఓరుగల్లు రూపు రేఖలు.. దిశదశ మారనుంది. అద్దం వంటి రహదారులు, ఆహ్లాదాన్నిచ్చే పచ్చదనం, నగరమంతా వైఫై సౌకర్యం, అవాంతరాల్లేని విద్యుత్ సరఫరా, వేగవంతమైన ప్రజా రవాణా, ప్రత్యేక ప్రాంతాల్లో చిరు వ్యాపారులు, ఈ-విధానంలో కార్యకలాపాలు, కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్, మళ్లింపునకు రింగ్ రోడ్లు, వినోదానికి పార్కులు, మల్టీలెవల్ పార్కింగ్, జీపీఎస్ ట్రాకింగ్, గ్రీన్ బిల్డింగ్‌లకు               ప్రోత్సాహం, కాలుష్యం లేని వాతావరణం ఇలా మన నగరం స్మార్ట్‌సిటీగా అభివృద్ధి వైపు పురోగమించనుంది. -  వరంగల్ అర్బన్
 
వరంగల్ అర్బన్ : హృదయ్ పథకంలో చోటు దక్కించుకోవడంతోపాటు గ్రేటర్ హోదా పొందిన వరంగల్ నగరం సిగలో మరో మణిహారం చేరింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకానికి ఎంపికైంది. తొలివిడతలో దేశవ్యాప్తంగా వంద నగరాలతో పోటీపడి స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొద్ది నెలలుగా స్మార్ట్‌సిటీలపై ముమ్మరమైన కసరత్తు చేపట్టింది. ఓరుగల్లుకు స్మార్ట్ అర్హతలపై మహా నగర పాలక సంస్థ అధికారులు పలుమార్లు నివేదికలు సమర్పించారు. ఓరుగల్లు విశిష్టతలు, నగరానికి ఉన్న అర్హతలను  పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఎట్టకేలకు కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో ఐదు స్మార్ట్ సిటీలను ఎంపిక చేయగా... ఇందులో వరంగల్ నగరం స్మార్ట్ సిటీ హోదా ఖరారైంది. దీంతో ప్రజాప్రతినిధులు,అధికారులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
మారనున్న ఓరుగల్లు దశాదిశ

 స్మార్ట్‌సిటీతో ఓరుగల్లు దశాదిశ మారనుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఆధునిక నగర నిర్మాణానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లభించనున్నాయి. ప్రజల విద్య, వైద్య, ఆరోగ్య జీవన ప్రమాణాలు సహా పరిపాలన పరమైన సేవలన్నీ జాతీయ స్థాయిలో ఉండేలా నగరాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు కేంద్రం రూ.70 కోట్ల నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ట్రాఫిక్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్,  బిల్డింగ్స్, కమ్యూనికేషన్స్, ట్రాన్‌పొర్టేషన్ విభాగాల్లో మార్పులు సంభవించనున్నారుు. వీటికి అనుబంధంగా ఇతర అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టే అవకాశం ఉంది. స్మార్ట్‌సిటీ ప్రణాళిక రూపకల్పనలో నగర మేయర్, కమిషనర్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా)లు కీలక పాత్ర పోషిస్తాయి.

నగరం మొత్తం వైఫై..

ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి సంబంధిత సంస్థలకు డబ్బులు చెల్లించాలి. స్మార్ట్ సిటీలోఆ బాధ ఉండదు. నగరం మొత్తం వైఫై వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. ప్రతిఒక్కరూ సెల్‌ఫోన్లు, ల్యాప్ టాప్‌ల ద్వారా నగరంలో ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే సదుపాయం సమకూరనుంది.
 
కాలుష్యానికి చెక్..

నగర ప్రజలు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య కాలుష్యం. స్మార్ట్‌సిటీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా   గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఈ విధానంలో భవనాలపై మొక్కలు పెంచేలా ప్రోత్సాహకాలు అందిస్తారు. కొత్తగా నిర్మించనున్న భవనాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఉండాలి. అదేవిధంగా ఇంకుడుగుంతలు నిర్మించిన తర్వాతే భవనం నిర్మించేలా నిబంధనలు కఠినతరం చేస్తారు. వీటితో పాటు పగటి వేళ భవనంలోకి గాలి, వెళుతురు వచ్చే బిల్డింగ్ డిజైన్ల వైపు ప్రజలు మొగ్గు చూపేలా ప్రణాళిక రూపొందిస్తారు. నగర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, పార్కులను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తారు.
 
ఈ పరిపాలన..


 మహా నగర పాలక సంస్థ పరిధిలో పౌరసేవలు మరింత సులభమవుతాయి. పన్నుల చెల్లింపు, అనుమతులు త్వరతగతిన అందే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేక అప్లికేషన్లు, ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సామాజిక సైట్ల ద్వారా కూడా పౌరసేవలు పొందవచ్చు. ఇదేసమయంలో ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంపొదిస్తారు. వినియోగదారుడు బల్దియాలో పెట్టుకున్న ఆర్జీ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా కార్పోరేషన్ ద్వారా అందుతున్న సేవలు సంతృప్తికంగా ఉన్నాయా ? లేదా ? అనే అంశాన్ని నేరుగా ఉన్నతాధికారులకు తెలియజేసే అవకాశం ఉంటుంది.
 
ప్రజారవాణా సులభం, వేగవంతం..

 నగరంలో ప్రజా రవాణా కీలకం. ఈ మేరకు వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా నిబంధనలుంటాయి. ఫలితంగా ఆయా వాహనాల గమన సమాచారం ప్రభుత్వ అధికారుల వద్ద నిక్షిప్తమవుతుంది. తద్వారా సులభంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేస్తారు. వాతావరణం ఏ మాత్రం కలుషిత ం కాకుండా చర్యలు తీసుకుంటారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. నగరంలోని ముఖ్య కూడళ్లు, రహదారుల్లో సీసీ కెమెరాలు, మైక్‌లు అమరుస్తారు. వీటి సాయం... సెంట్రల్ కంట్రోల్ స్టేషన్ ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. ఒక పాయింట్‌లో ట్రాఫిక్ రద్ధీ ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఆ దారిలో వెళ్లే వాహనదారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తారు. అంతేకాదు స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాహనదారులు తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఎలక్ట్రికల్ చార్జింగ్, బ్యాటరీ అధారిత వాహనాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు. పెట్రోల్‌బంక్‌ల తరహాలో వెహికల్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. రహదారుల వెంట పాదచారులు నడిచేందుకు,  సైకిళ్లు వెళ్లేందుకు ప్రత్యేక మార్కింగ్ వేస్తారు.  నగర జీవనంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు పెద్దపీట వేస్తారు. మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అవసరం లేని వాహనాల రాకపోకలను నియంత్రించడానికి రింగు రోడ్లను అభివృద్ధి చేస్తారు.

24 గంటల పాటు విద్యుత్

నగరంలో వీధిదీపాల నిర్వహణ, విద్యుత్ సరఫరాలో పెనుమార్పులు సంభవిస్తాయి. నగరంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రత్యేక గ్రిడ్ పరిధిలోకీ తీసుకొస్తారు. ఏ ప్రాంతంలోనైనా విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఎదురైతే తక్షణమే స్పందించే వీలుంటుంది.  తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుగునిచ్చే అధునాతన బల్బులను వీధిదీపాలుగా ఉపయోగిస్తారు. సరఫరా నష్టాలను నివారించేందుకు స్మార్ట్ విద్యుత్ మీటర్లను బిగిస్తారు. దీని ద్వారా విద్యుత్ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించే వీలుంటుంది.
 
మెరుగైన డ్రెరుునేజీ వ్యవస్థ

 మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల నగరంలో చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి రోడ్లు చెడిపోవడం, గోతులు పడడం వంటివి జరుగుతుంటాయి. స్మార్ట్‌సిటీగా ఎంపికైన తర్వాత ఇటువంటి అగచాట్లు కానరావు. నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చ ర్యల్లో భాగంగా సీనరేజీ ప్లాంట్లు నెలకొల్పే అవకాశం ఉంది. ఇలా శుద్ధి చేసిన నీటిని పార్కులు, రోడ్ల పక్కన చెట్ల నిర్వహణకు ఉపయోగిస్తారు. అదేవిధంగా క్లీన్‌సిటీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారు. తడి, పొడి చెత్తను రోడ్లపై పారబోయడం కాకుండా వీటి నుంచి విద్యుత్ ఉత్పత్తితో పాటు కార్పొరేషన్‌కు ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందిస్తారు.
 

మరిన్ని వార్తలు