కుట్ర లేదు.. కుతంత్రం లేదు!

29 Jun, 2018 02:00 IST|Sakshi

సిమ్‌కార్డుల టార్గెట్‌ కోసమే ఈ పని చేశా

‘నకిలీ వేలిముద్రల’ సంతోష్‌ వెల్లడి

కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ‘కుట్ర లేదు.. కుతంత్రం లేదు.. సిమ్‌కార్డుల టార్గెట్‌ పూర్తి చేసుకో వడానికే నకిలీ వేలి ముద్రలు సృష్టించా. అలా యాక్టివేట్‌ చేసిన సిమ్‌కార్డుల్ని ధ్వంసం చేశా. ఇందులో మావోయిస్టులు, ఉగ్రవాదుల ప్రమే యమో లేదు. సెల్‌ఫోన్‌లో ఫోర్‌జీ సిమ్‌కార్డు ఉంది. దీంతో కంప్యూటర్‌తో పని లేకుండా సెర్చ్‌లు చేశా’ అని పాత సంతోష్‌కుమార్‌ పోలీసు, నిఘా వర్గాల దగ్గర ఏకరువు పెట్టాడు. ఇంటర్నెట్, యూట్యూబ్‌లో చూసి ఈ పని చేశానని, ఇంత పెద్ద నేరమనే విషయం కూడా తెలియదని చెప్పాడు. గత వారం అరెస్టు చేసిన సంతోష్‌ను ఎస్సార్‌నగర్‌ పోలీసులు విచారణ కోసం కోర్టు అనుమతితో గురువారం కస్టడీలోకి తీసుకున్నారు.  

ఈ వ్యవహారంలో అసాంఘిక శక్తుల కోణానికి సంబం ధించి పోలీసులు సంతోష్‌ను వివిధ కోణా ల్లో ప్రశ్నిస్తున్నారు. అయితే, రూ.51 టాక్‌టైమ్‌తో కూడిన సిమ్‌కార్డుల్ని ఉచితంగా ఇద్దామన్నా సాధ్యం కాలేదని, అందుకే నెలకు 600 సిమ్‌కార్డుల యాక్టివేషన్‌ టార్గెట్‌ పూర్తి చేయడానికి ప్రత్యా మ్నాయ మార్గాలు వెతికానన్నాడు. సిమ్‌కార్డు పొందాలంటే ఆధార్‌ వివరాలు, వేలిముద్ర తప్పనిసరి కావడంతో ఇబ్బందులు ఎదుర య్యాయని, కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక సర్వీస్‌ ప్రొవైడర్‌ నుంచి ఓ వ్యక్తి పేరుతో గరి ష్టంగా 9 సిమ్‌కార్డులే జారీ అయ్యేలా నిబం ధనలు అమల్లోకి రావడంతో పరిస్థితి మరింత దిగజారిందన్నాడు. టార్గెట్‌ పూర్తి చేయడం కోసం అనేక మార్గాలు అన్వేషించానన్నాడు. స్థిరాస్తుల క్రయ విక్రయాల సమయంలో పూర్తి పేరు, చిరు నామా, ఆధార్‌ నంబర్‌తోపాటు వేలిముద్రలు డాక్యుమెంట్‌లో పొందుపరు స్తారని గుర్తించానని చెప్పాడు. 

దాదాపు 8 నెలలుగా..
దాదాపు 8 నెలలుగా రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ నుంచి డాక్యుమెంట్లు డౌన్‌లోడ్‌ చేయడం ప్రారంభించానని సంతోష్‌కుమార్‌ అధికారులకు వెల్లడించాడు. పాలిమర్‌ ఆధారిత రబ్బర్‌ స్టాంపుల తయారీ యంత్రాన్ని ఇండి యా మార్ట్‌ వెబ్‌సైట్‌ నుంచి రూ.16 వేలకు ఖరీదు చేసి నకిలీ వేలిముద్రలు సృష్టించానని వివరించాడు. 3 వేలకు పైగా వేలిముద్రలు తయారు చేసి, 6 వేల సిమ్‌కార్డులు యాక్టివేట్‌ చేసినట్లు అంగీకరించాడు. యాక్టివేటైన కార్డుల ను, పని పూర్తయిన వేలిముద్రల్ని ధ్వంసం చేశానని, కొన్నింటిని టాక్‌టైమ్‌ పూర్తయ్యే వర కు వాడి పడేశానన్నాడు. అంతేతప్ప ఎలాంటి హ్యాకింగ్‌కు పాల్పడలేదని, ఆధార్‌ సహా ఏ వెబ్‌సైట్‌లోకి అక్రమంగా చొరబడలేదని సంతోష్‌కుమార్‌ వివరించాడు. తొలిరోజు విచారణ హైదరాబాద్‌లో పూర్తి చేసిన అధికారులు శుక్రవారం సంతోష్‌ స్వస్థలం పెద్దపల్లి జిల్లా ధర్మారం తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అక్కడ అతనికి చెందిన ధనలక్ష్మీ కమ్యూనికేషన్‌లో సోదాలు చేయనున్నారు. ఇప్పటికే రబ్బర్‌ స్టాంపుల తయారీ యంత్రంతో పాటు అతడి సెల్‌ఫోన్, డౌన్‌లోడ్‌ చేసిన 1,400 డాక్యుమెంట్లు, నకిలీ వేలిముద్రల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘దామరచర్ల’కు డబుల్‌ ట్రాక్‌ లైన్‌

ఎర్రమంజిల్‌ భవనాన్ని హెచ్‌ఎండీఏ కాపాడాలి 

భూ రికార్డులను సంస్కరించాలి 

భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం

రుణమాఫీ గజిబిజి

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

విషమంగా ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం.. చికిత్స నిలిపివేత

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఆగస్టు 31లోగా ఆర్టీఐ కమిషనర్లను నియమించండి

పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదని టవర్‌ ఎక్కిన వ్యక్తి

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్‌

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..! 

డొక్కు బస్సులే దిక్కు !

పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు

కథ కంచికేనా !

డెంగీ.. డేంజర్‌

ఇక ఇంటికే  ఈ– చలాన్‌ 

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది

మొక్కుబడి గ్రామసభలకు చెక్‌ 

భాష లేనిది.. నవ్వించే నిధి

ఓడీఎఫ్‌ సాధ్యమేనా.?

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..!

నా కొడుకును బతికించరూ..

చేయూతనందిస్తే సత్తా చాటుతా..!

ప్రతిజ్ఞాపకం ‘పార్టీ’ నే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’