చిన్నారి గొంతులో ఇరుక్కున్న వాచ్‌ బ్యాటరీ

27 Jul, 2019 03:09 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరిప్రియ

ఆపరేషన్‌ చేసి తొలగించిన డాక్టర్‌ 

సాక్షి, కొత్తగూడెం: ఓ చిన్నారి గొంతులో వాచ్‌ బ్యాటరీ ఇరుక్కుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపూడికి చెందిన తేజావత్‌ హర్యా కూతురు (10 నెలలు) శుక్రవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో పాడైపోయిన చేతి గడియారం బ్యాటరీని మింగగా అది గొంతులో ఇరుక్కుంది. శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు కొత్తగూడెంలోని సురక్ష ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్‌ రవిబాబు నాయక్‌ ఎక్స్‌రే తీసి గొంతులో బ్యాటరీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే చిన్నారికి ఆపరేషన్‌ చేసి తొలగించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్‌ రవిబాబు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు