బాటసారుల దాహం తీరుస్తున్న చలివేంద్రాలు

30 Apr, 2018 14:02 IST|Sakshi
ఆర్యవైశ్య సంఘం చలివేంద్రం వద్ద దాహం తీర్చుకుంటున్న బాటసారులు

కొనసాగుతున్న దాతల సహకారం:  25 ఏళ్లుగా సేవలు

వికారాబాద్‌ అర్బన్‌: ఎండలు మండిపోతున్నాయి. రోడ్డు మీద నడవాలంటే జనాలు బయపడుతున్నారు. పైగా పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో పట్టణంలో ఎక్కడ చూసినా జనాల సందడే నెలకొంది. తీవ్ర ఎండల్లో కొద్ది దూరం నడవగానే దాహం వేస్తోంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు దాహం తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి బాటసారులందరికి చలివేంద్రాలు దాహం తీరుస్తూ ఎండ నుంచి ఉపశమనం ఇస్తున్నాయి. వికారాబాద్‌ పట్టణంలో సుమారు 20చోట్ల చలివేంద్రాలు ఉన్నాయి.

కొన్ని చోట్ల కుల సంఘాలు, వృత్తి సంఘాలు, ప్రభుత్వ శాఖలు, వ్యక్తిగతంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాట సారులకు రోజంతా నీరు అందిస్తున్నారు. తీవ్ర ఎండల్లో వచ్చిన వారికి చల్లటి మట్టి కుండ నీరు ఇచ్చి చల్లబరుస్తున్నారు. నిర్వాహకులు  గతంలో ఏప్రిల్‌ మొదటి వారంలో చలివేంద్రాలను ప్రారంభించి మే చి వరి వరకు కొనసాగించే వారు. ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్చి మొదటి వారం నుంచే ప్రారంభించినట్లు చెబు తున్నారు. మార్చిలో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు  ఉండటంతో విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నెల రోజుల ముందే చలివేంద్రాలు ప్రారంభించారు. ఇలా వి కారాబాద్‌ పట్టణంలో చలివేంద్రాలు బాట సా రుల దాహం తీరుస్తున్నాయి.

సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో...
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో   25 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఎ ప్పుడూ ప్రయాణికులతో, విద్యార్థులతో రద్దీ గా ఉండే బస్టాండ్‌లో చలివేంద్రం ఏర్పాటు చే యడంతో ఎంతో మంది దాహం తీరుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వెళ్లే వారు, బస్టాండ్‌లో బస్సు ఆగిన సమయంలో సత్యసాయి చలి వేంద్రంలో దాహం తీర్చుకొని ప్రయాణమతా రు. వేసవిలో సుమారు మూడు నెలల పాటు ఇ క్కడ చలివేంద్రం సేవలు అందిస్తారు.

ఆర్యవైశ్య సంఘం ..
జనాలతో రద్దీగా ఉండే అనంతగిరి రోడ్డు ఎస్‌బీఐ బ్యాంక్‌ ఎదుట ఆర్యవైశ్య సంఘం ఆ ధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బ్యా ంకుకు వచ్చే జనాలతో పాటు, వందల మంది బాటసారులు ఇక్కడ దాహం తీర్చుకుంటారు. పది సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారుల దాహం తీరుస్తున్నారు.

పోలీసు శాఖ...
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం నూతనంగా చలివేంద్రాన్ని ఏ ర్పాటు చేసి బాట సారుల దాహం తీరుస్తున్నా రు. నెల రోజుల క్రితం ఎస్పీ అన్నపూర్ణ ఈ చలి వేంద్రాన్ని ప్రారంభించారు.

వాకర్స్‌ అసోసియేషన్‌ ..
పట్టణంలోని ఆలంపల్లి రోడ్డు వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ఎదుట వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారుల దాహం తీరుస్తున్నారు. ఈ రోడ్డులోనే వ్యాపారాలు సాగుతుంటాయి. ఎప్పుడు జనాల రద్దీ ఉంటుంది. ఈ రోడ్డు పక్కనే చలివేంద్రం ఉండటంతో రోజు కు వందల మంది దాహం తీర్చుకుంటారు. వి కారాబాద్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పది సంవత్సరాలుగా చలివేంద్రం కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు