తీవ్ర నీటి ఎద్దడి..

3 Feb, 2018 14:58 IST|Sakshi
కొత్తపూసపల్లి ప్రజల దాహార్తి తీర్చే బావిలో నీరు అడుగంటిన దృశ్యం    

     అడుగంటుతున్నభూగర్భ జలాలు

     ఆరు రోజులకోసారి నీటి సరఫరా  

     ఆందోళనలో కొత్తపూసపల్లి వాసులు

ఇల్లెందుఅర్బన్‌: మండల పరిధిలోని కొత్తపూసపల్లి గ్రా మస్తులకు వేసవి కాలం ప్రారంభం కాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామంలో 50 కుటుంబాలు నివస్తిస్తున్నాయి. గ్రామం సమీపంలోని బ్రీటీష్‌ దొరల హాయంలో నిర్మించిన  బావిలో నుంచి నీటిని గ్రామంలోని వాటర్‌ ట్యాంకుల్లోకి సరఫరా చేసి అనంతరం ఇండ్లల్లోకి సరఫరా చేస్తున్నారు. బ్రీటీష్‌ బావి ద్వా రానే  గ్రామస్తులు తమ దాహార్తీని తీర్చుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా జనవరి చివరి వారం నుంచే భానుడి ప్రతాపం చూపిస్తుండటంతో బావిలో నీరు అడుగుంటిపోతోంది. దీంతో ఆరు రోజులకోసారి నీటిని సరఫరా చేయాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నిర్మించిన 5 మినీ వాటర్‌ ట్యాంకులు నీటి సరఫరా తగ్గిపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఇది ఇలా ఉండగా 30 ఏళ్ల క్రితం వాటర్‌ట్యాంకులకు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపులైన్‌లు పూర్తిగా శిథితమై తరచూ లీకేజీలవుతున్నాయి. దీంతో 20 నిమిషాల్లో నిండాల్సిన ట్యాంకు గంట సమయమైనా కూడ నిండటంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. మార్చి చివరి నాటిలోపే బావిలో పూర్తి గా నీరు అడుగంటిపోతుందని అంటున్నారు. ప్రత్యామ్నాయంగా నీటి వసతిని కల్పించేందుకు రొంపేడు పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు.  


నిరుపయోగంగా ట్యాంకు


గ్రామ ప్రజలకు నిరంతరం నీటిని అందిచేందుకు 2004లో సింగరేణి యాజమాన్యం రూ 14లక్షల వ్యయంతో గ్రామంలో ఓవర్‌ హెడ్‌ట్యాంకు నిర్మించడంతో పాటుగా సింగరేణి యాజమాన్యమే నీటిని సరఫరా చేసింది. కాలక్రమేణా ట్యాంకుకు ఏర్పాటు చేసిన పైపులైన్‌లు పూర్తిగా ధ్వంసం కాకపోవడంతో దాదాపు 9 ఏళ్లపాటు ట్యాంకు నిరుపయోగంగానే దర్శనమిస్తోంది. నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారేలేరని ఆవేదన వ్యక్తంచేశారు. 


వారానికోసారి..


గ్రామ ప్రజలకు నీటిని అందించే బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన బావిలో నీరు సగానికిపైగా అడుగంటిపోవడంతో ప్రస్తుతం ఆరు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇటు సింగరేణి యాజమాన్యం, అటు పంచాయతీ అధికారులు కూడ నీటి ఎద్దడి సమస్యను తీర్చడంలో శ్రద్ధ కనబర్చడంలేదు . 
కుమారస్వామి, పూసపల్లి

నీటి కష్టాలు


వేసవి ప్రారంభం కాకముందే పూసపల్లి గ్రామస్తులు నీటి కష్టాలు పడుతున్నారు. బావిలో సరిపడ నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర నీటి సరఫరా చేస్తున్నా పైపులైన్‌ లీకేజీల ద్వారా ప్రజల దాహార్తీ తీరడంలేదు. ఇప్పటికైనా అ«ధికారులుస్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలి.    – బలరాం, పూసపల్లి  

మరిన్ని వార్తలు