ఆల్మట్టికి పోటెత్తిన కృష్ణమ్మ

10 Jul, 2020 03:24 IST|Sakshi
గురువారం ఆల్మట్టిలో కృష్ణమ్మ పరవళ్లు 

కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలతో 50 వేలక్యూసెక్కుల ప్రవాహం

విద్యుదుత్పత్తి ద్వారా దిగువ నారాయణపూర్‌కు నీటి విడుదల

తుంగభద్రలోనూ 16 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఈ నెల చివరికి దిగువకు ప్రవాహాలు..

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణాకు ఎగువన వర్షం, దిగువన హర్షం.. చినుకు చినుకుకు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పరీవాహకం పరవశిస్తోంది. ప్రవాహాలు పెరిగినకొద్దీ దిగువ ప్రాజెక్టుల్లో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా ఎగువన ఉన్న ఆల్మట్టికి రోజురోజుకూ వరద ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి నుంచి విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటి విడుదలను కర్ణాటక మొదలు పెట్టింది.

మరో 50 టీఎంసీలు చేరితే దిగువకు...
పశ్చిమ కనుమల్లో 3, 4 రోజులుగా 20 సెంటీమీటర్లకుపైగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టిలోకి ప్రవాహాలు పుంజుకుంటున్నా యి. గురువారం ప్రాజెక్టులోకి 49,636 క్యూ సెక్కుల ప్రవాహాలు రాగా, ఇవి సాయం త్రానికి 52 వేల క్యూసెక్కులకు పెరిగినట్లు కేంద్ర జలసంఘం అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం ఆల్మట్టిలో 129 టీఎంసీలకు 85 టీఎంసీల నిల్వ ఉంది. ఈ సీజన్‌లో 60 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ఎగువ నుంచి ప్రవాహాలు ఇంకా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఆల్మట్టిలో విద్యుదుత్పత్తిని కర్ణాటక ఆరంభించింది. విద్యుదుత్పత్తి ద్వారా 10,088 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌ల ద్వారా విడుదల చేస్తోంది.

మరో 45 టీఎంసీలు చేరితే గేట్లెత్తి ప్రాజెక్టు నుంచి దిగువకు ఎక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మ ట్టి నుంచి నీటి విడుదలతో దిగువన నారాయణపూర్‌లోకి 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇక్కడ ప్రస్తుతం 37 టీఎంసీలకుగానూ 26.50 టీఎంసీల నీరునిల్వ ఉంది. మరో 5 టీఎంసీల నీరు చేరిన వెంటనే దిగువన జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుద ల చేసే అవకాశం ఉంది. ప్రవాహాలు ఇదే రీతిన కొనసాగితే ఈ నెల మూడోవారం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయొచ్చని నీటి పారుదల శాఖ అంచనా. ప్రస్తుతం జూరాలలో నీటి నిల్వ 9.66 టీఎంసీలకుగానూ 7.80 టీఎంసీలకు చేరింది.

ఫలితంగా నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పంపు ల ద్వారా 1,466 క్యూసెక్కుల నీటిని పం పింగ్‌ చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి 16,211 క్యూసెక్కుల మేర నీరు వస్తుం డగా, నిల్వ 100 టీఎంసీలకుగానూ 14 టీ ఎంసీలకు చేరింది. ఉజ్జయిని నదిలోకి 4,587 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఇ క్కడ నిల్వ 117 టీఎంసీలకుగానూ 60 టీ ఎంసీలకు చేరింది. ఇక స్థానిక పరీవాహకం నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 669 క్యూసెక్కు ల ప్రవాహం వస్తోంది. అక్కడ నిల్వ 215 టీఎంసీలకుగానూ 36.50 టీఎంసీలు ఉం ది. నాగార్జునసాగర్‌లోకి 1,280 క్యూసెక్కు ల ప్రవాహాలు వస్తుండగా, నిల్వ 312 టీఎంసీలకు 168.54 టీఎంసీలు ఉంది.

మరిన్ని వార్తలు