వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించిన కేటీఆర్

19 Oct, 2015 14:15 IST|Sakshi

మాడేగావ్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సిద్దిపేట స్ఫూర్తితో వాటర్ గ్రిడ్ ను విజయవంతం చేస్తామని ప్రకటించారు. వాటర్ గ్రిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ35 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం చేయడం లేదని స్పష్టం చేశారు.

వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్షం అన్నారు. వాటర్ గ్రిడ్ పనుల్లో ఎలాంటి అవినీతి జరగలేని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి లతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు