బిందెడు నీటికోసం పడిగాపులు!

27 Nov, 2018 10:43 IST|Sakshi
వెలుగుపల్లిలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న నల్లావద్ద నీటిని పట్టుకుంటున్న మహిళలు

 వారానికి ఒకేసారి కృష్ణా తాగునీటి సరఫరా

 ఇబ్బందులు పడుతున్నగ్రామీణ ప్రజలు

 పట్టించుకోని యంత్రాంగం 

సాక్షి, నల్లగొండ రూరల్‌ : బిందెడు తాగునీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఆ 6 గ్రామాల ప్రజలకు ఏర్పడింది. కృష్ణా తాగునీరు ఎప్పుడు వస్తుందా అని బిందెలు, క్యాన్లు పెట్టుకొని వృద్ధులు, చిన్నారులు ఎదురుచూస్తున్నారు. లక్షలు వెచ్చించి గ్రామాల్లో కృష్ణా తాగునీటి కోసం నిర్మించిన నీటి ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయి. తాగునీటి ట్యాంకులకు కృష్ణా జలాలు చేరకపోవడంతో పైప్‌లైన్‌కు నల్లాను ఏర్పాటు చేసుకొని ప్రజలు నీటిని పట్టుకుంటుం న్నారు. నీటిసమస్యపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం కావడంలేదని వెలుగుపల్లి, రసూల్‌పురం, ముశంపల్లి, గుట్టకింద అన్నారం, మేళ్లదుప్పలపల్లి, అన్నారెడ్డిగూడెం గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారానికి ఓకేసారి నీటి సరఫరా:
మండలంలోని 6 గ్రామాలకు కృష్ణా తాగునీరు సక్రమంగా సరఫరా కావడంలే దు. వారానికి ఒకసారి నీటి ని సరఫరా చేస్తుండడంతో గ్రా మస్తులు తాగునీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండకు వచ్చి నీటిని కొ నుగోలు చేయడం ఆర్థిక భారంగా మారడంతోపాటు తాగునీటికి ఇ బ్బందులు తప్పడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు.
చర్లగౌరారం ప్లాంట్‌ నుంచి నీటి సరఫరా:
చర్లగౌరారం కృష్ణా వాటర్‌ ప్లాంట్‌ నుంచి నల్లగొండ మండలంలోని 6 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉన్నప్పటికీ నీటి సరఫరా ఎందుకు చేయడంలేదని అధికా రులను ప్రజలు నిలదీస్తున్నారు. ఎప్పుడు అడిగి నా రేపటినుంచి సరఫరా చేస్తామని చెబుతున్నారే తప్ప అధికారుల పనితీరులో మార్పు ఉండటంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
పైపులకు నల్లాల బిగింపు:
గ్రామాల్లో ఏర్పాటు చేసిన ట్యాంకులకు కృష్ణా జలాలు సరఫరా చేయకపోవడంతో గ్రామస్తులు వాటర్‌ పైప్‌లైన్‌కు నల్లా ఏర్పాటు చేసుకున్నారు. 6 గ్రామాల్లో అనధికారికంగా నల్లా ఏర్పాటు చేసకుని కృష్ణా నీటిని బిందెల్లో పట్టుకుంటున్నారు. నీటిసరఫరా బంద్‌ కావడంతో నిల్వ ఉన్న మురికి నీరు తాగునీటి పైపుల్లోకి వెళ్లి కృష్ణా జలాలు కలుషితమవుతున్నాయి. అధికారులు తక్షణమే చర్య తీసుకుని నీటిఎద్దడి ఉన్న గ్రామాలపై దృష్టి సారించి ప్రతిరోజు కృష్ణా జలాలు సరఫరాచేయాలని ప్రజలు కోరుతున్నారు. 

నీళ్లు రాక 5రోజులైంది
కృష్ణా తాగునీరు సరఫరా లేక 5రోజులైంది. దీంతో బావులవద్ద నీటిని పట్టుకొని వస్తున్నాం. ఒక్క ట్యాంక్‌కు కూడా కృష్ణా జలాలు ఎక్కడం లేదు. నీటిసమస్యను ఎవరు పట్టించుకోవడంలేదు. నీళ్లు పెట్టేందుకు వచ్చిన వారికి చెప్పితే వస్తయి అంటున్నారు.

– విమల, వెలుగుపల్లి
క్యాన్‌ నీళ్ల కోసం తిప్పలు
క్యాన్‌ వాటర్‌ కోసం నల్లగొండకు పోవడం వల్ల వ్యవసాయ పనులకు ఇబ్బందిగా మారింది. నల్లా ఎప్పుడు వస్తదో తెలియక రెండు బిందెలు నల్లా వద్ద పెట్టి పిల్లలను అక్కడ ఉంచి పనులకు పోతున్నాం. ఏనాడు సక్కంగా నీరు రావడంలేదు.  

    – పద్మ, వెలుగుపల్లి 

మరిన్ని వార్తలు