జీవజలం..

12 Aug, 2019 02:29 IST|Sakshi

కార్పొరేషన్లలో రోజూ మిలియన్‌ గ్యాలన్ల నీటి సరఫరా 

జనాభా పెరుగుతుండటంతో తప్పని కొరత 

ఆహారం లేకుండా రెండుమూడు రోజులైనా ఉండగలమేమో గానీ.. నీరు తాగకుండా ఉండటం కష్టం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతుంటారు. తాగడానికే కాదు.. ఎన్నో రకాల అవసరాలకు మనకు నీరు వినియోగం తప్పదు. పల్లెల్లో ఎలా ఉన్నా.. పట్టణాల్లో మాత్రం రోజూ వేల లీటర్లు కావాలి. ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ లాంటి కార్పొరేషన్లలో అయితే మిలియన్‌ గ్యాలన్ల నీరు అవసరం.

రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్‌ల్లో రోజూ ఆయా వాటర్‌ బోర్డులు ప్రజలకు అవసరమైన మేర నీటి సరఫరా చేస్తున్నాయి. అయినా కొన్ని చోట్ల మాత్రం కొరత తప్ప డం లేదు. రోజురోజుకు నగర జనాభా పెరుగుతుండటంతో అంతమందికి నీటి సరఫరా కత్తి మీద సాము లాంటిదే... కార్పొరేషన్లలో నీటి సరఫరా తీరుపై ఓ లుక్కేస్తే.... 
- సాక్షి, నెట్‌వర్క్‌

మరిన్ని వార్తలు