గద్వాల పేరును అంగీకరించం: ఎమ్మెల్యే

5 Oct, 2016 16:33 IST|Sakshi
గద్వాల పేరును అంగీకరించం: ఎమ్మెల్యే

హైదరాబాద్: గద్వాల జిల్లాకు జోగులాంబ పేరు పెట్టాలని మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. గద్వాల పేరును తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని హైపవర్ కమిటీకి వివరించామని చెప్పారు.

కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై కె. కేశవరావు నాయకత్వంలో నియమించిన హైపవర్ కమిటీతో పలు జిల్లాల నాయకులు సమావేశమయ్యారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నాయకులు హైపవర్ కమిటీకి తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలిపారు.

జనగామ జిల్లా ఏర్పాటుపై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చర్చించారు. మంత్రి కేటీఆర్, ఎంపీ బాల్క సుమన్ సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై హైపవర్ కమిటీతో సంప్రదింపులు జరిపారు.

మరిన్ని వార్తలు