వాగ్దానాలను అమలు చేస్తాం: నాయిని

26 Jun, 2014 21:35 IST|Sakshi
వాగ్దానాలను అమలు చేస్తాం: నాయిని

హైదరాబాద్: ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బేగంబజార్ శృంగరుషి భవన్‌లో టీఆర్‌ఎస్ నేతలు శంకర్‌లాల్‌యాదవ్, న్యాయవాది రాజశేఖర్‌లు ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ఇళ్ల నిర్మాణాలు, పోలీస్ వ్యవస్థలో మార్పులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తామన్నారు.

గోషామహల్ నియోజకవర్గంతోపాటు బేగంబజార్ ప్రాంతంలో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. నియోజకవర్గంలో పార్టీని పటి ష్టపర్చాలని సూచించారు. 14 సంవత్సరాల పాటు ఉద్యమాలుచేసి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా రూపొందించడమే పార్టీ ధ్యేయమన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేసే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా శంకర్‌లాల్‌యాదవ్, రాజశేఖర్‌లు నాయినికి పగడికట్టి సన్మానించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు