బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం

31 Jul, 2014 02:27 IST|Sakshi
బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం

హైదరాబాద్: వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన చరిత్ర బీజేపీ సొంతమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేతివృత్తులు, కుల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంటు, బీసీ సబ్‌ప్లాన్ అమలు కోసం నిరాహారదీక్షలు చేపట్టామని గుర్తు చేశారు. బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రధాని మోడీని కలిసి కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. మరోవైపు హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని కిషన్‌రెడ్డి సీఎంకు వినతిపత్రం సమర్పించారు.

కిషన్‌రెడ్డితో ఓయూ విద్యార్థుల భేటీ

కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బుధవారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించాలని ఆయనను కోరారు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలకు కొదవ ఉండదని ఆశపడ్డామని... ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో తమకు అవకాశాలు లేకుండా పోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 

మరిన్ని వార్తలు