నీటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది

31 Jul, 2019 20:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సహజ వనరులను సముచితంగా ఉపయోగించుకోవడం ద్వారా నీటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రముఖ జల‌ సంరక్షణ ఉద్యమకారుడు సోలార్ సురేష్ అన్నారు. బుధవారం జల శక్తి అభియాన్‌లో భాగ౦గా జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ సిబ్బందితో జల‌ సంరక్షణ, హరిత కార్యక్రమాల గురించి ఆయన చర్చి౦చారు. ఈ సందర్భంగా జల‌ సంరక్షణపై ఆయన మాట్లాడుతూ.. క్యాంపస్‌ను పచ్చగా మార్చాలని ఆయన నిసా సిబ్బందికి సూచించారు. నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించడం ద్వారా 240 ఎకరాల ప్రాంగణం ప్రయోజనం పొందుతుందని ఆయన అన్నారు.

సోలార్‌ సురేష్‌గా పిలువబడే ప్రసిద్ధ జల‌ సంరక్షణ ఉద్యమకారుడు సురేష్ ఐఐటి- చెన్నై, ఐఐఎం-అహ్మదాబాద్‌కి చె౦దిన‌ పూర్వ విద్యార్థి. చెన్నైలోని తన ఇ౦టిలో  సౌర ఫలకాలు, వర్షపు నీటి సేకరణ, బయోగ్యాస్, టెర్రేస్ గార్డెన్స్, గాలి నుంచి తాగునీరు తయారు చేసే ఎయిర్-ఓ-వాటర్ య౦త్రాన్ని ఉపయోగించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించారు.

మరిన్ని వార్తలు