పాతబస్తీ అభివృద్ధికి కృషి చేయాలి 

24 Apr, 2018 03:42 IST|Sakshi

అధికారులకు సీఎస్‌ ఎస్‌కే జోషి ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: సీఎం ఆదేశాల మేరకు పాతబస్తీ అభివృద్ధి పనుల కార్యాచరణ ప్రణాళికను వెంటనే రూపొందించాలని సీఎస్‌ ఎస్‌కే జోషి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో పాతబస్తీ అభివృద్ధి పనులపై సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. మంచినీటి ఎద్దడి లేకుండా శాశ్వత ప్రాతిపదికన కొత్త రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు, పాత పైపులైన్ల స్థానంలో కొత్త పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా ప్రణాళిక డీపీఆర్‌ తయారీకి కన్సల్టెంట్‌ నియామకం జరిగిందన్నారు.

విద్యుత్‌ అంతరాయం లేకుండా అవసరమైన సబ్‌స్టేషన్లు నిర్మించడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉంచుకోవాలని, మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు తెరిచేముందే అన్నిస్కూళ్లలో విద్యుత్‌ సరఫరా ఉండేలా చూడాలని, ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, చిత్రా రామచంద్రన్, అర్వింద్‌ కుమార్, శాంతికుమారి, రఘుమారెడ్డి, దానకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు