‘బాబ్రీ’పై సుప్రీం తీర్పును గౌరవిస్తాం

23 Mar, 2017 00:36 IST|Sakshi

జమాతే–ఇ–ఇస్తామి హింద్‌ తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుడు

హన్మకొండ చౌరస్తా: బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరం వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని జమాతే–ఇ–ఇస్లామి హింద్‌ తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుడు మౌలానా హమీద్‌ మహ్మద్‌ ఖాన్‌ సాహెబ్‌ అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మ కొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబ్రీ వివాదంపై ఆరుసార్లు చర్చలు జరిగినా స్పష్టత లేక సమస్య అలాగే మిగిలిపోయిందని, గతం పునరావృతం కావద్దంటే న్యాయ స్థానమే సరైన తీర్పు చెప్పాలని, ఆ తీర్పుకు తాము కట్టుబడి ఉంటామన్నారు.

వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్‌ అధికారాలు ఇవ్వాలని, అప్పుడే ఆయా ఆస్తులకు రక్షణ ఉంటుందని  అభిప్రాయపడ్డారు.  ముస్లింలకు 12 శాతం రిజర్వేç Ùన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీ కమిషన్‌ను నియమించడం సమంజసం కాదన్నారు.

మరిన్ని వార్తలు