ఆవిష్కరణలకు అండగా ఉంటాం

8 Feb, 2017 11:52 IST|Sakshi
ఆవిష్కరణలకు అండగా ఉంటాం

ఔషధ పరిశ్రమల సీఈవోలతో మంత్రి కేటీఆర్‌
అమెరికా, బ్రిటన్‌లో మాదిరి ఇక్కడ లాబీయిస్టు గ్రూపులు లేవు
పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నాం


సాక్షి, హైదరాబాద్‌: ఔషధ పరిశోధనలు, ప్రయోగాల (క్లినికల్‌ ట్రయల్స్‌) వ్యయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని పరిశ్రమ లు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఔషధరంగ పరిశోధనల్లో భాగస్వా మ్యాన్ని పెంచడం, వాణిజ్యాన్ని ప్రోత్సహిం చడం ద్వారా ధరలను దించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బయో ఆసియా సదస్సు రెండోరోజు మంగళవారం ఇక్కడి హైటెక్స్‌లో జరిగింది. ‘100 కోట్ల కొత్త రోగులకు చికిత్స–ఔషధ పరిశ్రమల పాత్ర’ అంశంపై దిగ్గజ ఔషధ రంగ పరిశ్రమల సీఈవోలతో నిర్వహించిన చర్చాగోష్టిలో మంత్రి మట్లాడారు. మౌలిక సదుపాయాల ను కల్పించడం, నిబంధనలను సడలించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం కల్పిస్తోందన్నారు. బ్రిటన్, అమెరికాల మాదిరిగా రాష్ట్రంలో లాబీయిస్టు గ్రూపులు లేవన్నారు. దేశ ఔషధ పరిశ్రమల్లో 35 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయ న్నారు.

లైఫ్‌సైన్స్‌ రంగంలో తెలంగాణ.. దేశ రాజధానిగా ఖ్యాతి గడించిందన్నారు. పర్యా వరణ పరిరక్షణకు సైతం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఔషధ రంగ పరిశోధనలు మానవాళికి ఎంతో మేలు చేశాయని, మనిషి జీవితం కాలం పెరగడం లో పరిశుభ్రత సగం పాత్ర పోషిస్తే ఔషధాలు సగం పాత్ర పోషించాయని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ చీఫ్‌ సైంటిఫిక్‌ అధికారి డాక్టర్‌ పౌల్‌ స్టొఫెల్స్‌ పేర్కొన్నారు. ఇంకా మరెన్నో ఆవిష్కరణలకు అవకాశం ఉందని చెప్పారు. కేన్సర్, క్షయ, హృద్రోగ మందులపై పరిశోధనల కోసం భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామన్నారు. పరిశోధనలు, అభి వృద్ధి రంగంలో చేస్తున్న పెట్టుబడులను తిరిగి రాబట్టేందుకు జీవ వైజ్ఞానిక పరిశ్రమల రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని నొవార్టిస్‌ సంస్థ గ్లోబల్‌ హెడ్‌ (డ్రగ్‌ డెవలప్‌ మెంట్‌) డాక్టర్‌ వసంత్‌ నరసింహన్‌ పేర్కొన్నారు.

ఔషధ, జీవ వైజ్ఞానిక రంగ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలపై 1,50,000 కోట్ల డాలర్లను ఖర్చు పెట్టాయ న్నారు. ఈ డబ్బులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి? తిరిగి ఎలా రాబట్టాలి? అన్న ప్రశ్నలకు సమాధానాన్ని శోధించాల్సి ఉందన్నారు. కొత్త ఔషధ ఆవిష్కరణలే ప్రముఖ ఔషధ కంపెనీల ఏర్పాటుకు దారితీశాయని నోబెల్‌ పురస్కార గ్రహీత, అమెరికాలోని స్క్రిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ కర్ట్‌ వుత్రిచ్‌ పేర్కొన్నారు.

ఔషధ కంపెనీలతో చర్చలు
రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ప్రముఖ ఔషధ కంపెనీలు నోవార్టిస్, గ్లెన్‌ మార్క్, జీఎస్‌కే తదితర కంపెనీల ప్రతిని ధులతో మంత్రి సదస్సులో ప్రత్యేక చర్చలు జరిపారు. రాష్ట్రంలో అందిస్తున్న ప్రోత్సహ కాలు, విధానాలను వారికి తెలిపారు.

మరిన్ని వార్తలు