ప్రతీ రైతుకు న్యాయం చేస్తాం

11 Jun, 2018 19:01 IST|Sakshi
ధర్పల్లి: తహసీల్దార్‌ కార్యాయంలో మాట్లాడుతున్న జేసీ రవీందర్‌రెడ్డి 

ధర్పల్లి నిజామాబాద్‌ : భూమి కలిగిన ప్రతి రైతుకు రైతుబంధు పథకం వర్తించేలా న్యాయం చేస్తామని జేసీ రవీందర్‌రెడ్డి సూచించారు. ధర్పల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన ఆదివారం తనిఖీ చేశారు. రైతుబంధు పథకం పనులు ఎంత మేరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యలు ఎలా పరిష్కరించాలో వీఆర్వోలకు సూచించారు. ధరణీ వెబ్‌సైట్‌ ద్వారా ప్రస్తుతం పట్టాదారు పాస్‌బుక్స్‌ మొదటి పేజీ మార్పులు చేర్పులు చేస్తున్నామన్నారు.

మొదటి పేజీపై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు న్యాయం చేస్తామన్నారు. మిగిలిన రైతు సమస్యలను ఈనెల 20లోగా పరిష్కరిస్తామన్నారు. ప్రతి రైతుకు పట్టాదారు పాస్‌బుక్స్‌తో పాటు పెట్టుబడి చెక్కులు వచ్చేలా చూస్తామన్నారు. వీఆర్వోలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రమేశ్, డీటీ మధు, ఆర్‌ఐ, శ్రీనివాస్, వీఆర్వోలు ఉన్నారు.

సెలవు దినాల్లోనూ పని చేయాలి.. 

ఇందల్‌వాయి(నిజామాబాద్‌రూరల్‌): పార్ట్‌– బీలో భూరికార్డుల ప్రక్షాళన పూర్తయ్యే వరకు రెవెన్యూ సిబ్బంది సెలవు దినాల్లో కూడా పని చేయాలని జేసీ రవీందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇందల్వాయి తహసీల్‌ కార్యాలయానికి వచ్చారు. పార్ట్‌– బీలో జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన తీరును తహసీల్దార్‌ సుధాకర్‌ రావును అడిగి తెలుసుకున్నారు.

ఆధార్‌ సీడింగ్, సాదా బైనామాలను సరిచేసి, పేర్లు, ఫొటోలు తప్పులు ఉంటే వాటిని జూన్‌ 20లోగా సరి చేయాలన్నారు. రైతులందరికీ పట్టా పాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందేలా చూడాలన్నారు. అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు