రేషన్ కార్డులు తొలగిస్తే ఉద్యమిస్తాం

29 Sep, 2014 23:42 IST|Sakshi

ఇబ్రహీంపట్నం: సర్వేల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదల రేషన్‌కార్డులను తొలగిస్తే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ హెచ్చరించా రు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం ఎంపీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల్లో ఇప్ప టి వరకు ఒక్కటికూడా నెరవేర్చకపోవడం దారుణమన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఓ వైపు రైతు లు ఇబ్బందులు పడుతుంటే.. రుణమాఫీ పై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

ఫీజు రీ యింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దోబూచులాడుతోందని విమర్శించారు. పారిశ్రామిక విధానంపై రోజుకో ప్రకటన చేస్తోందని.. కార్యాచరణ మాత్రం ఎక్కడా కనిపిం చడంలేదన్నారు. సకాలంలో వర్షాలు కురవక జిల్లా తూర్పు డివిజన్‌లో అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, పెట్టుబడులు సైతం చేతికందని పరిస్థితి తలెత్తిందన్నారు. పశువులకు గ్రాసంకూడా అందక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరారు. ఎంపీపీ డోకూరి వెంకట్రాం రెడ్డి, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు పండాల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు జహంగీర్‌ఖాన్, చర్లపటేల్‌గూడ ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మయ్యయాదవ్, ఆనంద్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు