'చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం'

14 Oct, 2014 16:50 IST|Sakshi
'చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం'

హైదరాబాద్: బోరుబావిలో పడ్డ చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. మరో కొద్ది సేపట్లో చిన్నారి మృతదేహాన్ని వెలికితీస్తామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. చిన్నారి పడిన బోరుబావి స్థల యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాల్టా చట్టాన్ని అమలు చేస్తామన్నారు.

 

రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. బావిలో 45 అడుగుల వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు