థియేటర్లలో అధికధరలపై చర్యలు తీసుకుంటాం

25 Jul, 2018 09:18 IST|Sakshi
 మాట్లాడుతున్న తూనికలు, కొలతల అధికారులు 

ప్రమాణాలు పాటించాల్సిందే

జిల్లా తూనికలు, కొతల అధికారి కిషన్‌

వికారాబాద్‌ అర్బన్‌ : సినిమా థియేటర్లలో తిను బండాల విషయంలో ప్రమాణాలు పాటించాల్సిందేనని తూనికలు, కొతల శాఖ జిల్లా అధికారి కిష న్‌ తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయం లో జిల్లాలోని సినిమా థియేటర్ల యాజమాన్యం ప్రతినిధులు, మేనేజర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తూనికలు కొలతల శాఖ రాష్ట్ర కమిషనర్‌ ఆదేశం మేరకు ఆగస్టు 1నుంచి థియేటర్లలో కొనసాగుతున్న క్యాంటిన్లపై తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.

క్యాంటిన్లలో ఏ వస్తువు కూడా ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్మరాదని తెలిపారు. ప్రధానంగా పాప్‌కారŠన్స్‌ తదితరాల విక్రయాల్లో వినియోగదారులను తీవ్రంగా మోసం చేస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. పాప్‌కారŠన్స్‌ పరిమాణం, వాటికి తీసుకునే ధర విషయాన్ని స్పష్టంగా వినియోగదారుడికి తెలిసే లా ఒక స్టిక్కర్‌ అతికించాలని సూచించారు. అవే వివరాలను బోర్డుపై పేర్కొనాలని తెలిపారు.

ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జరిమానాలతో పాటు, కేసులు నమోదు చేస్తామ ని హెచ్చరించారు. వాటర్‌ బాటిల్స్, కూల్‌డ్రింగ్స్‌ తదితరాలను అధిక ధరలు విక్రయిస్తే చర్యలుత ప్పవని స్పష్టం చేశారు. ఏ వస్తువు ఎంత ధరకు అమ్ముతున్నారనే విషయాన్ని తప్పకుండా అన్ని థియో టర్లలో బోర్డులపై రాసి ఉంచాలని తెలి పారు. వినియోగదారుడి సౌకర్యార్థం అదే బోర్డుపై టోల్‌ఫ్రీ నెంబర్‌ 180042500333, వాట్సప్‌ నం బర్‌ 7330774444ను తప్పకుండా పొందుపర్చాలని చెప్పారు.

ఈ సందర్భంగా కొందరు థియేటర్ల యజమానులు మాట్లాడు తూ.. క్యాంటిన్‌లో చోటుచేసుకునే విషయాలకు థియేటర్‌ మేనేజర్లను బాధ్యులను చేయొద్దని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. థియేటర్‌ యాజమాన్యం, క్యాంటిన్‌ నిర్వాహకులను బాధ్యులను చేయాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన అధికారులు మేనేజర్లపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని హామీ ఇచ్చారు.

అయితే, థియేటర్‌లోని క్యాంటిన్‌లో అధిక ధరలకు తినుబండారాలు తదితరాలు అమ్మకుండా, వినియోగదారులు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మేనేజర్లపైనే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తూనికల కొలతల అధికారి అశోక్‌రావు అదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు