గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలకు సిద్ధమే: జూడాలు

2 Nov, 2014 13:30 IST|Sakshi

 హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు తాము సిద్ధమేనని జూనియర్ డాక్టర్లు ఆదివారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా వైద్యుల కోసం ప్రస్తుతం ఉన్న విధాన్నాన్ని కొనసాగించి, తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలనే తాము ప్రభుత్వాన్ని కోరుతున్నట్ల తెలిపారు. అందుకోసమే  తమ ఆందోళన అని జూడాలు వెల్లడించారు. కానీ తమను బలవంతంగా గ్రామాలకు పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని వారు ఆరోపించారు. తమను వాడుకుని వదిలేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.

ప్రభుత్వ అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు వైద్యులు ముఖం చాటేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన వైద్యసేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందవన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యసేవలు అందించడం నేరమని జూడాలు గుర్తు చేశారు. ఏమైనా జరిగితే వైద్యులకే నష్టమని తెలిపారు.ఇలాంటి చర్యల వల్ల కొత్త వైద్యుల్లో అభద్రత నెలకొంటోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 16 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులతో ఎలా బాండ్ రాయించుకుంటారని జూడాలు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఖాళీ పోస్టుకన్నా ఎక్కువమందిని నియమించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వ వైఖరిని జూడాలు తప్పు పట్టారు.

మరిన్ని వార్తలు