సారాను అమ్మం-తాగం

26 Jan, 2015 20:03 IST|Sakshi

నల్గొండ : గణతంత్ర వేడుకల సందర్భంగా నేరేడుచర్ల గ్రామ అభివృద్ధి కమిటీ అధ్వర్యంలో సారాను నిషేధించాలని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ విచ్చలవిడిగా సారా అమ్మకాల వల్ల మత్తుకు బానిసలై చనిపోతున్నారని వాపోయరు.

చాలా మంది  చిన్న వయసులోనే అర్ధంతరంగా జీవితాలు పోగొట్టుకుంటున్నారన్నారు. కుటుంబాలు దిక్కులేక రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సారా రక్కసి గ్రామం నుంచి పారదోలాలని, గ్రామంలో సారా అమ్మవద్దని, తాగవద్దని  గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఎంపీటీసీ పండరి, ఉపసర్పంచ్ భంగ్యా, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ విద్యానాయక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు