కొనసాగుతున్న అల్పపీడనం

5 May, 2020 16:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 4 రోజుల వరకు అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది.

తూర్పు బీహార్  నుండి దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు ఆగ్నేయ మధ్యప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. నేడు,ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (30 నుంచి 40 కి.మీ.) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 42 నుండి 44 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ  శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు