మూడ్రోజులు వడగాడ్పులు

22 May, 2020 03:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సూర్యుడు భగ్గుమంటున్నాడు. రెండ్రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలుచోట్ల 40 నుంచి 46 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. గురువారమైతే ఖమ్మంలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కరోనా నేపథ్యంలో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ప్రజలకు ఎండ తీవ్రత ఇబ్బంది పెడుతోంది. కార్మికులు, కూలీలు ఎండకు ఇక్కట్లు పడుతు న్నారు. ఒకవైపు కరోనా భయం వెంటాడుతుంటే, మరోవైపు ఎండ తీవ్రతతో జ్వరాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతా వరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా వడ దెబ్బ తగలకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని విన్నవిస్తు న్నారు. వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో అక్కడ క్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటిం చింది. ఉంపన్‌ తుపాను వెళ్లిపోవడంతో గాలిలో తేమ కూడా లేకుండా పోయిందని, దీంతో పొడిగాలులు వీస్తున్నాయని, ఫలితంగా ఎండ తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. ఈ మూడ్రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీలు నమోదయ్యే పరిస్థితి ఉందన్నారు.  

మరిన్ని వార్తలు