రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

26 Jan, 2019 15:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరిత ఆవర్తనం ఏర్పడిందని, దీని కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలంగాణలో ఈ రోజు, రేపు(ఆదివారం) ఉరుములతో కూడిన వర్షంతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు ఒకటి రెండు చోట్ల వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. 

కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వడగండ్ల వర్షంతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమ వారాల్లో కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు