వణుకుతున్న ఇందూరు

16 Dec, 2018 09:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

భయపెడుతున్న చలి గాలులు

ఇప్పటి వరకు అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌): చలి పులి పంజా విసురుతోంది. ఐదు రోజులుగా జిల్లాలో మారుతున్న వాతావరణంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండగా, చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. మంచు వాతావరణం ఏర్పడి రోజంతా చలి గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చలి గాలుల తీవ్రత పెరిగి జిల్లా వాసులను ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు కొలిచిన ఉష్ణోగ్రతను చూస్తే 17.5 డిగ్రీలు నమోదైంది. ఒక్క రోజు వ్యత్యాసంలోనే ఏకంగా ఒకటిన్నర డిగ్రీలు పడిపోయింది.

ముఖ్యంగా పెరుగుతున్న చలి తీవ్రతకు చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యం భారిన పడుతున్నారు. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరాలకు గురికావడంతో ఆస్పత్రులకు తాకిడి పెరిగింది. స్వెట్టర్‌లు వినియోగించినా అవి చలి నుంచి స్వల్వంగానే రక్షిస్తున్నాయి. రాత్రుల్లో నిద్రపోయే సమయంలో దుప్పట్లు ఒకటికి రెండు వినియోగించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఫ్యాన్‌లకు ఏ మాత్రం పని చెప్పడం లేదు. ఇటు పనులపై, ఉద్యోగ రీత్యా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ముఖాలకు మాస్క్‌లు, చేతులకు గ్లౌజ్‌లు ధరించి అన్ని జాగ్రత చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు.

మరిన్ని వార్తలు