నేత కార్మికురాలు ఆత్మహత్య

28 Sep, 2015 21:38 IST|Sakshi

కరీంనగర్ జిల్లా వీణవంక మండలకేంద్రానికి చెందిన సబ్బని మధునమ్మ(49) అప్పులబాధతో సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మధునమ్మ- రామచంద్రం దంపతులు వీణవంక చేనేత సంఘంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా ఆప్కో నూలు పోగులు ఇవ్వడం లేదు. దీంతో పని దొరక్క ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. పూట గడవడం కూడా కష్టంగా మారింది. కుటుంబం గడిచేందుకు అప్పులు తేవాల్సి వచ్చింది. దీనికి తోడు ఏడాది క్రితం అప్పు చేసి కూతురు వివాహం జరిపించారు. మొత్తం అప్పులు రూ.6 లక్షలకు చేరడంతో అప్పులెలా తీర్చేదని మనోవేదన చెందిన మధునమ్మ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
 

మరిన్ని వార్తలు