సంక్షేమ హాస్టళ్లలో ‘బయోమెట్రిక్’

22 Jan, 2015 01:09 IST|Sakshi

ఫిబ్రవరి 1 నుంచి అమలు
దళిత సంక్షేమశాఖ డీడీ కృష్ణవేణి
ఏఎస్‌డబ్ల్యూఓలు, హెచ్‌డబ్ల్యూఓలతో సమీక్ష

 
నక్కలగుట్ట : జిల్లాలోని 99 దళిత సంక్షేమశాఖ హాస్టళ్ల లో ఫిబ్రవరి ఒకటి నుంచి బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు  జిల్లా దళిత సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ డిప్యూటీ డెరైక్టర్ కొమ్మెర్ల కృష్ణవేణి తెలిపారు. హన్మకొండ కలెక్టరేట్‌లోని దళిత సంక్షేమశాఖ డీడీ కార్యాలయంలో బుధవారం ఏఎస్‌డబ్ల్యూఓలు, హెచ్‌డబ్ల్యూఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దళిత సంక్షేమ హాస్టళ్లలో ఆధార్ కార్డులు లేని విద్యార్థుల వివరాలు సేకరించాలని సూచించారు. వారిని ఆధార్‌కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేర కు విద్యార్థులు హాస్టళ్లలో చదువుకునే చోట లైటింగ్ ఏర్పా టు చేయూలని, హాస్టళ్లలోని మరుగుదొడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయించాలన్నారు. విద్యార్థులకు నెలకు రెండు చొప్పున టారుులెట్ సబ్బులను అందుబాటులో ఉంచాలన్నారు. మరుగుదొడ్ల మరమ్మతులకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదించాలని జిల్లాలోని అన్ని హాస్టళ్లలో మౌలిక సదుపాయూల కల్పనకు హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని ఏఎస్‌డబ్ల్యూఓలకు సూచించారు.

ప్రధానంగా హాస్టళ్లలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మండల సర్వసభ్య సమావేశాలకు ఏఎస్‌డబ్ల్యూఓలు హాజరై హాస్టళ్లలోని సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కష్టాల్లో ఉన్నారని, అన్ని విధాలుగా ఆదుకోవాలని కొమ్మెర్ల కృష్ణవేణిని హెచ్‌డబ్ల్యూఓల సంఘం జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్ ఇన్‌చార్జ్ ఏబీసీడబ్ల్యూఓ సురేందర్ కోరారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమశాఖ డీడీ కార్యాలయ సూపరింటెం డెంట్లు సత్యనారాయణ, వరలక్ష్మి, హన్మకొండ ఏఎస్‌డబ్ల్యూఓ రమాదేవి, హెచ్‌డబ్ల్యూఓల సం ఘం జిల్లా ప్రధానకార్యదర్శి రవీందర్‌రెడ్డి, హెచ్‌డబ్ల్యూఓలు భవానీ ప్రసాద్, రాంరెడ్డి, చంద్రశేఖర్, సుదర్శన్‌రావు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు