దళిత సీఎం హామీ ఏమైంది?

6 Sep, 2014 00:02 IST|Sakshi

 జిన్నారం : తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన హామీ ఏమైందని, అరచేతిలో స్వర్గం చూపించే కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మవద్దని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు.  మండలంలోని బొల్లారం గ్రామంలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డికి మద్దతుగా శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమానికి పొన్నాలతో పాటు మండలి విపక్ష నేత డీ శ్రీనివాస్‌లు హాజరయ్యారు. గ్రామానికి చెందిన అనిల్‌రెడ్డితో పాటు గ్రామ యువకులు పొన్నాల సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో పొన్నాల మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మూడేళ్లలో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తానని కేసీఆర్ తప్పుడు ప్రచారం చే స్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

డీ శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశ్రామికంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. కేవలం సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ప్రజలను మాటల గారడీతో మభ ్యపెడుతున్న కేసీఆర్‌కు బుద్ధి రావాలంటే ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ అభ్యర్థి సునితారెడ్డి మాట్లాడుతూ ఓటర్లు తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, పార్టీ రాష్ర్ట మహిళా అధ్యక్షురాలు లలిత, జెడ్పీటీసీ సభ్యుడు బాల్‌రెడ్డి, నాయకులు సురభి నాగేందర్‌గౌడ్, నిర్మల, మద్ది వీరారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు