హెచ్చార్సీల ఏర్పాటుపై మీ వైఖరేంటి?

2 May, 2018 03:29 IST|Sakshi

తెలంగాణ, ఏపీ సహా 16 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీలో మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయకపోవడంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  మానవ హక్కుల కమిషన్ల ఏర్పాటు పై వైఖరి తెలియజేయలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం కేంద్రం, ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలకు నోటీసులిచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్చార్సీ ఏర్పాటు చేయకపోవడంతో పౌరుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు బాధితులు న్యాయం పొందలేకపోతున్నారని జమ్ముల చౌదరయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది.

2 రాష్ట్రాల్లో యాథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీలోని పురుషోత్తపట్నం ప్రాజెక్టు నిర్వాసితుల హక్కులకు భంగం వాటిల్లుతోందని,  రైతులపై పోలీసులు దాడులకు పాల్పడిన ఘటనలను ఈ సందర్భంగా పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. 

మరిన్ని వార్తలు