కరోనాపై వాట్సాప్‌ ‘చాట్‌ బాట్‌’ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

7 Apr, 2020 03:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తోంది. అందులో భాగంగా వివిధ సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించుకుంటోంది. కరోనాపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్‌ సౌజన్యంతో నిర్దిష్టమైన చాట్‌ బాట్‌ రూపొందించిందని’రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ను గౌరవిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలని, అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలని సూచించారు.

కరోనాపై సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాట్సాప్‌ ‘చాట్‌ బాట్‌’ను కేటీఆర్‌ సోమవారం ఆవిష్కరించారు. 9000658658 నంబరుపై ‘‘TS Gov Covid Info’’ పేరిట రూపొందించిన ఈ వా ట్సాప్‌ చాట్‌ బాట్‌ ద్వారా కరోనా గురించిన సమాచారంతో పాటు కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియచేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌.బి.టెక్నాలజీస్, మెసెంజర్‌ పీపుల్‌ సంస్థతో కలిసి రాష్ట్ర ఐటీ, వైద్య ఆరోగ్య శాఖలు ఈ చాట్‌ బాట్‌ను రూపొందించాయి. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.

ఇలా చేయాలి...
చాట్‌ బాట్‌ సంభాషణ ప్రారంభించడానికి 9000658658 నంబరుకు ‘HI’లేదా ‘Hello’లేదా ‘Covid’అని వాట్సాప్‌లో సందేశం పంపించాలి. లేదా  https://wa.me/919000658658?text=Hi లింకును మొబైల్‌ నుండి క్లిక్‌ చేయాలి. సూచనలు ఉంటే covid19info-itc@telangana.gov.inకి ఈ మెయిల్‌ చేయవచ్చు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా