‘వాట్సాప్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

24 Aug, 2018 00:42 IST|Sakshi
గురువారం హైదరాబాద్‌లో వాట్సాప్‌ సీఈవో క్రిస్‌ డేనియల్స్, నోవార్టీస్‌ సీఈవో వ్యాస్‌ నరసింహన్‌తో సమావేశమైన మంత్రి కేటీఆర్‌

వాట్సాప్‌ సీఈవోకు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

లైఫ్‌సైన్స్‌ క్లస్టర్ల ఏర్పాటుపై నోవార్టీస్‌ సీఈవోతో చర్చ

సాక్షి, హైదరాబాద్‌: వాట్సాప్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఆపరేషన్స్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వాట్సాప్‌ సీఈవో క్రిస్‌ డేనియల్స్‌ని కోరారు. గురువారం క్రిస్‌ డేనియల్స్, ఫేస్‌బుక్‌–ఇండియా పబ్లిక్‌ పాలసీ డివిజన్‌ అధ్యక్షుడు శివ్‌నాథ్‌ తుక్రాల్‌ కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఆపరేషన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని క్రిస్‌ డేనియల్స్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

లైఫ్‌సైన్స్‌ క్లస్టర్లలో ముందుండాలి
కేటీఆర్‌ ఆహ్వానం మేరకు నోవార్టీస్‌ సీఈవో వ్యాస్‌ నరసింహన్‌ గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్‌ను కలసి రాష్ట్రంలో లైఫ్‌సైన్స్‌ ఎకోసిస్టమ్‌పై చర్చించారు. లైఫ్‌సైన్స్‌ క్లస్టర్లలో ఆసియాలోనే నంబర్‌ వన్‌గా నిలవాలన్నదే తమ లక్ష్యమని కేటీఆర్‌ అన్నారు.

జీనోమ్‌వాలీ వంటి లైఫ్‌సైన్స్‌ క్లస్టర్ల స్థాపనకు తమ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. నాలుగేళ్లలో రా ష్ట్రంలో 700 కొత్త పెట్టుబడి ప్రతిపాదనల (దా దాపు 100 ఆర్‌ అండ్‌ డీ యూనిట్లతో కలిపి)ను తాము ఆమోదించామని వివరించారు. వీటి విలువ రూ.10,200 కోట్లు ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు