నడిచేటప్పుడు చేతులు ఎందుకు ఆడిస్తాం?

5 May, 2015 01:05 IST|Sakshi
నడిచేటప్పుడు చేతులు ఎందుకు ఆడిస్తాం?

తెలుసుకుందాం..
 
పిల్లలూ.. నడిచేవాళ్లను గమనించారా? నడిచే సమయంలో కాళ్లు కదిలితే సరిపోతుంది కదా.. మరి చేతులు కూడా ఎందుకు కదులుతారుు. కొంతమంది కావాలనే వేగంగా చేతులు ఊపుతూ నడుస్తారు ఎందుకు? జీవశాస్త్రం ప్రకారం మానవుడు రూపాంతరం చెందడానికి జీవపరిణామ సిద్ధాంతం ఉందన్న విషయం మీకు తెలిసిందే! గొరిల్లా, చింపాంజీ వంటి జీవులను గమనిస్తే అవి అప్పుడప్పుడూ వెనుక కాళ్లమీద నిలబడి కాసేపు నడవగలవు. పరిణామ క్రమంలో మానవుడు పూర్తిగా కాళ్లమీదే నడవడం, నిలబడగలగడం నేర్చుకున్నాడు. ఇప్పుడు చేతులు ఎందుకు ఊపుతామో తెలుసుకుందాం.

మీరు కూడా కాసేపు కోతిలాగా కాళ్లమీద నడుస్తూ.. కాళ్లూ చేతులు కదిలే పద్ధతిని మార్చకుండా, క్రమంగా నిలబడి నడవండి చూద్దాం.. ఏమి గమనించారు. నాలుగు కాళ్ల జంతువులు నడిచేటప్పుడు.. దాని ముందరి కాళ్లు ఎలా కదులుతాయో, అదే విధంగా మనం నిటారుగా నిలబడినప్పుడు చేతులు కూడా అలాగే కదులుతాయని గమనించారా? అదీ సంగతి. లక్షల సంవత్సరాల క్రితం పురాతన మానవ జాతి కూడా నాలుగు కాళ్లపై నడుస్తూ.. ఆ తర్వాత రెండు కాళ్లపై నడవడం నేర్చుకున్నాడన్నమాట. అందుకే చేతులు కూడా కదులుతూ నడకకు పట్టును ఇస్తారుు.
 
 

మరిన్ని వార్తలు