పుష్కరాలకు ఏర్పాట్లు ఎప్పుడో!

5 Sep, 2014 02:02 IST|Sakshi

బాసర : జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో వచ్చే ఏడాది జూలై 7వ తేదీ నుంచి ప న్నెండు రోజుల పాటు నిర్వహించే గోదావరి పు ష్కరాలకు ఏర్పాట్లు నేటికీ ప్రారంభం కాలేదు. 2003లో జూలై 30 నుంచి ఆగస్టు 10వరకు నిర్వహించిన పుష్కరాల సమయంలో అరకొర వసతుల కారణంగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక మొదటిసారి నిర్వహించే పుష్కరాలు కావడంతో ప్రభుత్వం సరిప డా నిధులు మంజూరు చేసి పూర్తి స్థాయిలో వసతులు కల్పించాల్సిన అవసరముందని పలు హిందూధార్మిక సంస్థలు కోరుతున్నాయి.  
 
తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో..
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా వచ్చే ఏడాది నిర ్వహించనున్న గోదావరి పుష్కారాల కోసం బాసర వద్ద పూర్తి స్థాయి ఏర్పాట్లకు ప్ర ణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయా శాఖల అధికారులకు ఇప్పటికే  సూ చించారు. భక్తుల సౌకర్యార్థం బాసర గోదావరి నదికి రూ.50కోట్లతో పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.

రోడ్ల వి స్తరణ, వైద్యం, భద్రత, రైల్వే సౌకర్యం, బస్సు సౌకర్యం, విద్యుత్, తాగునీరు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసుతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఏర్పాట్లపై ముథోల్  ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అటవీ పర్యావరణ  శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ అధికార ప్రతినిధి వే ణుగోపాలాచారి సీఎంతో చర్చించినట్లు సమాచారం.  

 రోడ్ల విస్తరణ తప్పనిసరి..  
 హైదరాబాద్ నుంచి బాసర అమ్మవారి క్షేత్రం 200 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇందులో 150 కిలో మీటర్ల నేషనల్ హైవే జాతీయ రహదారి కాగా మిగతా 50 కిలో మీటర్ల రహదారి చిన్నదిగా ఉండడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఉన్న 50 కిలో మీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా మార్చే పనులు ప్రారంభించాలి. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి నుంచి బాసర వరకు చేరుకునే వాహనాలను గోదావరి పుష్కరాలకు వన్‌వే ట్రాఫిక్‌ను అనుమతించాలి. బాసరకు చేరుకున్న వాహనాలను తిరుగు ప్రయాణంలో మహారాష్ట్ర జిల్లా ధర్మాబాద్ నుంచి బోధన్ మీదుగా వాహనాలను మళ్లించాలి.

 భైంసా నుంచి 30కిలో మీటర్లు బాసర వరకు, ధ ర్మాబాద్ నుంచి బాసర వరకు 13 కిలోమీటర్ల వరకు రోడ్ల విస్తర ణ పనులు వెంటనే చేపట్టాలి. అలాగే నిజామాబాద్ నుంచి బాసరకు 35కిలో మీటర్ల రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా తీర్చి దిద్దేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలి. దీంతో వచ్చిపోయే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులుండవు. ఆర్టీసీ, రైల్వే అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు, రైళ్లను నడిపితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.  

 చేపట్టాల్సిన పనులు..
 ముఖ్యంగా తాగునీటి వసతి కల్పించి, పారిశుధ్య పనులు చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. గత పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల సంఖ్యకు అనుగుణంగా తాగునీటి కుళాయిలు, స్నాన ఘట్టాలు ఘాట్ 1 నుంచి ఘాట్ 2వరకు సీసీతో కూడిన స్నాన ఘట్టాలను వెంటనే నిర్మించాలి. గోదావరి ఘాట్లపై ఎత్తు భాగంలో వృద్ధులు, చిన్న పిల్లలకు వాటర్ షవర్స్, మహిళలకు స్నానాల గదులు, దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణాలు చేపట్టాలి. భక్తులు పిండ ప్రధానం చేసేందుకు విడివిడిగా గోదావరి నది వద్ద గ ద్దెలు నిర్మించాలి. నదీ తీరాన వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక వాహనాలతోపాటు క్యూలైన్లు ఏర్పాటు చేయాలి.  

 గత పుష్కరాల్లో భక్తుల ఇబ్బందులు..
 2003లో జరిగిన పుష్కరాల్లో భక్తులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం ఏర్పాట్ల కోసం రూ.కోటి మాత్రమే మంజూరు చేసి అరకొర వసతులు కల్పించింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తక్కువ సంఖ్యలో స్నాన ఘ ట్టాలను నిర్మించగా ఇక్కట్లు తప్పలేదు. తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్లు నిర్మించగా ప్రస్తుతం అవి అందుబాటులో లేకుండా పోయాయి. అ ప్పుడు నిర్మించిన పుష్కరాల ఘాట్లు పూర్తిగా శిథిలమయ్యాయి.

 అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం, అ ధికారుల అలసత్వం కారణంగా పూర్తి స్థాయిలో భక్తులకు వసతులు కల్పించలేదు. భక్తులు అం చనాకు మించి రావడంతో ఇబ్బందులు పడ్డా రు. తాగునీరు కూడా దొరకని పరిస్థితి తలెత్తిం ది. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అరకొరగా గదులు నిర్మించగా అవి సరిపోలేదు. బా సరకు చే రుకున్న భక్తులు పది కిలోమీటర్ల దూ రంలో వాహనాలు నిలిపి కాలినడకన  గోదావరి తీరానికి చేరుకోవాల్సి వచ్చింది. అప్పటి ఏర్పాట్లపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పుష్కరాలకు ముందుగా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఏర్పాట్లపై అర్చకులు, హిందూ ధార్మిక సంస్థలు సలహాలిచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వమైనా సరిపడా నిధు లు మంజూరు చేసి ఇప్పటి నుంచే  ఏర్పాట్లు ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం కా వని హిందూధార్మిక సంస్థలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు