ఆ రెండు లక్షలు ఏమయ్యాయి..?

14 Mar, 2018 08:08 IST|Sakshi
డబ్బులు తీసుకున్నట్లు ఇచ్చిన కాగితంపై ఉన్న అప్పటి ఈఓ సంతకం.... ఇన్‌సెట్లో శివకుమార్‌

ఈవోకు ఇచ్చానంటున్న టెండర్‌దారు

రశీదు తీసుకున్నాడంటున్న ఈవో

ఉన్నతాధికారులకు బాధితుడి ఫిర్యాదు

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 2017–18కుగాను జరిగిన జాతర వేలం పాటకు సంబంధించి రూ.రెండులక్షలు తేడాలొచ్చాయి. ఆ సమయంలో టెండర్‌ పాడిన అనుగం శివకుమార్‌ రూ.14, 85,232కు టెండర్‌ దక్కించుకున్నాడు. వాయిదాల పద్ధతిలో రూ.12లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.రెండు లక్షలను గత సంవత్సరం మే 7, 18న అప్పటి ఈవో సులోచనకు ఇచ్చానని, ఆ సమయంలో ల్లకాగితంపై రాసి ఇచ్చారని శివకుమార్‌ అంటున్నాడు. 

బయటపడిందిలా.. 
ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో టెండర్లు పిలిచారు. ఇందులో శివకుమార్‌ కూడా పాల్గొన్నాడు. పాత డబ్బులు చెల్లించలేదని, అవి చెల్లించాకే టెండర్‌లో పాల్గొనాలని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో శివకుమార్‌ అవాక్కయ్యాడు. తాను ఎప్పుడో డబ్బులు ముట్టజెప్పానంటూ అప్పటి ఈవో సులోచన రాసి ఇచ్చిన కాగితాన్ని చూపించాడు. అయినా వారు ససేమిరా అనడంతో ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సులోచనను వివరణ కోరగా.. తాను డబ్బులు తీసుకుని రశీదు ఇచ్చానని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు