దళితులకు మూడెకరాలు ఎక్కడిస్తరు?

26 Jun, 2014 03:48 IST|Sakshi
దళితులకు మూడెకరాలు ఎక్కడిస్తరు?

దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కొత్త ప్రభుత్వం కృషిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. దళితు లకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించా రు. ఇందుకు కావల్సిన భూమి అందుబాటులో లేకపో వడంతో అధికారులు అయోమయం చెందుతున్నారు.
- పంపిణీకి జిల్లాలో భూమి కరువు
- సీఎం ప్రకటనతో దళితుల్లో ఆనందం
- జిల్లా అధికారుల్లో ఆందోళన
- ఆగస్టు 15వరకు సాధ్యమయ్యేనా?
నిజామాబాద్ అర్బన్:
కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దళితులపై వరాల జల్లు కురిపిస్తోంది. ప్రతీ కుటుంబానికి మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం తో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. కానీ..ప్రభుత్వ నిర్ణయంతో అధికారుల్లో అయోమయం నెలకొంది. లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి జి ల్లాలో భూమి అందుబాటులో లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 15నుంచి దళితులకు భూపంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. దీంతో అధికారులు భూముల కోసం అన్వేషణ ప్రారంభిం చారు.
 
ఎక్కడెక్కడ
జిల్లాలో పంపిణీకి కావల్సిన భూము లు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు ఆరా తీస్తున్నారు. భూమి లేకపోవడంతోనే గతంలో ఇందిరమ్మ పథకం 6వ విడత భూపంపిణీ కార్యక్రమం జిల్లా లో నిర్వహించలేదు. ప్రస్తుత సర్కార్ దళితులకు భూపంపిణీపై పకడ్బందీ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు భూముల ఆచూకీ తీస్తున్నారు. ఇప్పటికే సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిసింది. దళితులకు మూ డెకరాల భూపంపిణీ ఎలాగైన ఇవ్వాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పడం అధికారులకు చెమటలు పట్టిస్తోంది.
 
ఆరో విడతకే కరువు
జిల్లాలో ఇందిరమ్మ భూపంపిణీ కార్యక్రమంలో భా గంగా మొదటి విడత కార్యక్రమంలో 1,086 మంది ఎస్సీలకు 1343.25 ఎకరాల భూమిని కేటాయించా రు. రెండోవిడతలో వెయ్యిమంది ఎస్సీలకు 1028.03 ఎకరాలు, మూడోవిడతలో 690 ఎస్సీ లబ్ధిదారులకు 683.23 ఎకరాలు, నాలుగో విడతలో 1,235 లబ్ధిదారులకు 1379.06 ఎకరాలు, ఐదో విడతలో 361 మంది ఎస్సీ లబ్ధిదారులకు 420.29 ఎకరాల భూమి ని కేటాయించారు. ఈ ఐదు విడతల్లో ఎస్సీలు మిన హా మిగితా వర్గాలకు చెందిన 17,495మంది లబ్ధిదారులకు కలిపి 22,129.05 ఎకరాలను కేటాయించా రు. ఆరో విడతకు వచ్చేసరికి ప్రభుత్వ భూమి కొరత ఏర్పడింది. భూమి అందుబాటులో ఈ విడత చేపట్టనే లేదు.
 
స్వాధీనం చేసుకోవాల్సిందేనా..!
ప్రస్తుతం అర్హులందరికీ మూడు ఎకరాల భూపంపిణీ చేపట్టాలంటే చాలా కష్టమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జనాభా 25.50 లక్షలు ఉండగా.. అందులో 8.50లక్షల మంది దళితులు ఉన్నారు. వీరి లో అర్హులైన వారందరికి మూడున్నర ఎకరాల చొ ప్పున భూపంపిణీ చేపట్టాలంటే పెద్దమొత్తంలో అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వం భూమి అందుబాటులో లేకుంటే గతంలో పరిశ్రమలు, అభివృద్ధి పనులకు కేటాయించిన భూముల్లో పనులు ప్రారంభం కాకపోతే వాటిని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది.

జిల్లాలో నందిపేట మండలం లక్కంపల్లి గ్రామం వద్ద ఫుడ్‌పార్కుకు కేటాయించిన భూమి మాత్రమే ఉంది. మిగితా ఎక్కడా ఇలాంటి భూములు అందుబాటులో లేవు. ఉన్న భూములను కస్తూర్బా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించారు.  ఇవి కొన్ని నిర్మాణంలో ఉండగా, మరికొన్ని ప్రారంభానికి నోచుకోలేదు.  

ఇలాంటి భూములను కూడా అధికారులు పంపిణీ చేయడానికి పరిశీలించే అవకాశం ఉంది. ప్రభుత్వం అవసరమైతే ప్రైవేటు భూములను సేకరించి ఇస్తామని చెప్పడంతో ఆ దిశగానూ దృష్టిసారిస్తున్నారు. భూపంపిణీపై సర్కారు నుంచి మరింత స్పష్టమైన విధి విధానాలు అందగానే పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు జిల్లా అధికారులు సమయాత్తమవుతున్నారు.

మరిన్ని వార్తలు