ఆయనే హీరో అయ్యిండు!

5 Jul, 2015 03:05 IST|Sakshi
ఆయనే హీరో అయ్యిండు!

‘చూసిండ్రు గదా... మేం అనుకుందే అయ్యింది. ఆయనే హీరో అయ్యిండు’ అంటూ ఓటుకు కోట్లు కేసులో బుక్కై, నెల రోజులు చర్లపల్లి జైలులో గడిపి బెయిల్‌పై బయకు వచ్చిన రేవంత్‌రెడ్డి గురించి మథనపడిపోతున్నారు కొందరు టీడీపీ నాయకులు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచే తెలంగాణ టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సరిపోను బలం లేకున్నా ఎమ్మెల్సీని ఎవరు గెలిపిస్తారని అధినేత పెట్టిన పోటీలో కొందరు వెనక పడ్డారు.తెలంగాణ టీడీపీలో అన్నీ తామై చక్రం తిప్పాలని ఉబలాటపడిన వాళ్లు మాత్రం ఇరుక్కున్నారు.

జైలుకు వెళ్లిన నాయకునిపై మొహమాటం కొద్దీ సానుభూతి ప్రకటించిన నేతలు కొందరు జైలు నుంచి బయటకు వచ్చిన రోజు జరిగిన హడావుడిపై మాత్రం పెదవి విరుస్తున్నారు. ‘అంతా కలసి పనిచేస్తేనే పార్టీ. ఒక్కన్నే హీరోను చేస్తరా? నగరంలో హోర్డింగులు... బ్యానర్లు... భారీ ర్యాలీలు... ఇపుడాయన ఎనకాల తోకలు పట్టుకుని మేం తిరగాల్నా’ అని అసంతృప్తినీ బయట పెడుతున్నారు. పార్టీ నాయకుడి తీరుపైనా రగిలిపోతున్న టీటీడీపీ సీనియర్లు ఈ ఒంటెత్తు పోకడలేంది? అంటూ నిలదీస్తున్నారు. మరో ముఖ్య నాయకుడైతే ఈ వ్యవహారమంతా నచ్చక విదేశాల బాట పట్టారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు