మమత విషయంలో ఎందుకు స్పందించరు?

5 Feb, 2019 03:37 IST|Sakshi

కేసీఆర్‌ను ప్రశ్నించిన వీహెచ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ, ప్రధాన కార్యదర్శికి గానీ సమాచారం ఇవ్వకుండా పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారిని అరెస్టు చేసేందుకు సీబీఐ ప్రయత్నించడం దారుణమని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల ఓట్లతో రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన మమతాబెనర్జీ ప్రభుత్వంపై మోదీ, అమిత్‌షాలు దాడిచేయబోయారని, మమత ఓ శక్తిలా అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడారని అన్నారు. బెంగాల్‌ సీఎంను, అక్కడి పోలీసులను అభినందిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎన్డీయేకు బీటీమ్‌ అని దీంతో తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశార 

మరిన్ని వార్తలు