కేసీఆర్కు రూ.5 కోట్లతో బస్సు ఎందుకు?

3 Jul, 2015 12:03 IST|Sakshi

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ...జిల్లాల్లో పర్యటన కోసం 'తెలంగాణ హరిత పథం' పేరుతో రూ.5 కోట్లతో బస్సును కొనుగోలు చేయటాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తప్పుబట్టారు. కేసీఆర్కు రూ.5 కోట్లతో బస్సు ఎందుకు...అదే రూ.5 కోట్లను పేదల కోసం ఖర్చు చేయొచ్చు కదా? అని ఆయన ప్రశ్నించారు. ఐదు కోట్లతో బస్సును కొనడం ప్రజా దుర్వినియోగమే అని వీహెచ్ మండిపడ్డారు. కేసీఆర్కు ఎవరి నుంచి ప్రాణహాని లేదని, అలాంటప్పుడు అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అని ఆయన విమర్శించారు.

వీహెచ్ ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సీనియర్ నేత డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో పాటు, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను ఆయన ఈ సందర్భంగా సోనియాకు వివరించారు. సోనియాతో సమావేశం అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ 'డీఎస్ పచ్చి అవకాశ వాది, ఆయన కాంగ్రెస్ను వీడటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదు. కాంగ్రెస్లో అన్ని పదవులు అనుభవించిన డీఎస్...ఇప్పుడు టీఆర్ఎస్ నేతల అవకాశాలు కొల్లగొట్టేందుకు వెళ్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు