బెంగళూరు మాదిరిగా వైఫై నగరంగా..

1 Jan, 2015 06:35 IST|Sakshi
బెంగళూరు మాదిరిగా వైఫై నగరంగా..

సాక్షి, సిటీబ్యూరో: దేశంలో బెంగళూరు మహానగరం తొలి ఫ్రీ వైఫై నగరంగా పేరొందింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నిత్యం మూడు గంటలపాటు సెల్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్‌తో ఉచితంగా నెట్ బ్రౌజ్ చేసుకునే సౌకర్యంతోపాటు500 ఎంబీ డేటా ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం విశేషం. నగరం నలుమూలల కూ వైఫై సౌకర్యం కల్పించేం దుకు కర్నాటక ఐటీ శాఖ ప్ర యత్నాలు ముమ్మరం చేసింది. డి-వాయిస్ సంస్థ ఈ పనులు చేపడుతోంది.

వై-ఫైని విని యోగిస్తున్న వారు ఏ హ్యాండ్ సెట్ వినియోగించారు, ఏ సమాచారం డౌన్‌లోడ్ చేసుకున్నారో సర్వర్ ద్వారా పసిగట్టే వీలుండడంతో పూర్తి భద్రత గల వై-ఫై నగరంగా ప్రా చుర్యం పొందింది. ఉచిత పార్కింగ్ యాప్ ద్వారా మీరున్న చోటు నుంచి దగ్గరున్న పార్కింగ్ కేంద్రాలు, గార్బేజ్ యాప్ ద్వారా చెత్త ఎక్కడ పడవేయాలో తెలుసుకోవడం ఈ వై-ఫై ప్రత్యేకత.
 
అదే స్ఫూర్తితో..

కొత్త ఏడాదిలో బెంగళూరు బాట లో మన సైబర్‌సిటీగా పేరొందిన హైదరాబాద్ మహా నగరం కూడా వై-ఫై బాటలో వేగంగా ముందుకెళుతోంది. హైటెక్‌సిటీ, మాదాపూర్ పరిధిలో 8 కిలోమీటర్ల పరిధిలో 17 కేంద్రాల వద్ద వైఫై సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్మార్ట్‌సిటీ దిశ గా హైదరాబాద్ దూసుకుపోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్ ఇతర వైఫై ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగిస్తున్న వారికి సాంకేతిక సేవలను ఉచితంగా వినియోగించుకునే సౌలభ్యం కలుగుతోంది. ప్రతి ఒక్కరూ నిత్యం 750 ఎంబీ నిడివిగల వైఫై సేవలను వినియోగించుకోవచ్చు. వైఫై సేవల కోసం హైటెక్‌సిటీ మాదాపూర్ పరిధిలో మొత్తం 17 చోట్ల ఎయిర్‌టెల్ సంస్థ ప్రత్యేక పోల్స్ ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో నగరం నలుమూలలకు ఈ ఏడాదిలో వై-ఫై సదుపాయం కల్పించేందుకు సర్కారు చేస్తోన్న కృషి సఫలీకృతం కావాలని ఆశిద్దాం.
 

మరిన్ని వార్తలు