చనిపోయిన వితంతువుకు పింఛన్

22 Mar, 2015 22:13 IST|Sakshi

ఆత్మకూరు(ఎం)(నల్లగొండ జిల్లా): చనిపోయిన వితంతు పింఛన్ ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతురాలి నుంచి వేలిముద్రలు తీసుకుని నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూర్.ఎం మండలం దుప్పెల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వితంతువు నాగుల చంద్రమ్మ(55) శనివారం అనారోగ్యంతో మృతిచెందింది. చంద్రమ్మకు ఇటీవల వితంతు పింఛన్ కింద ప్రభుత్వం రూ.1000 మంజూరు చేసింది. స్థానిక బీపీఎం రావుల వెంకటేశం ఆదివారం మృతురాలి ఇంటికి వెళ్లాడు. బయోమెట్రిక్ విధానం కావడంతో మృతురాలి వేలిముద్రలను తీసుకుని పింఛన్ డబ్బులను ఆమె కుటుంబీకులకు అందజేశారు. కాగా బీపీఎంపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బందెల స్వామిదాస్ కోరారు.

బీపీఎం వివరణ..
బయోమెట్రిక్ ద్వారా చంద్రమ్మ మృతదేహం నుంచి వేలిముద్రలను సేకరించి పింఛన్ అందజేసిన విషయం వాస్తవమేనని బీపీఎం రావుల వెంకటేశం తెలిపారు. గ్రామంలో కొందరు పెద్దమనుషులు కోరడంతో ఈ పనిచేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు