నాటు తుపాకితో ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్

17 Jan, 2016 19:43 IST|Sakshi

మంచాల: రంగారెడ్డి జిల్లాలో నాటు తుపాకి కలిగి ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మంచాల ఎస్సై యాదగిరి కథనం ప్రకారం...  ఎల్లమ్మ తండా గ్రామానికి చెందిన సపావట్ రవి కుమార్. వృత్తి రీత్యా ఆర్టీసీ డ్రైవర్.

ఆయన వద్ద తమ పూర్వీకులు వాడిన నాటు తుపాకిను కలిగి ఉన్నాడు. దానికి సంబంధించిన లైసెన్స్, ఎలాంటి అనుమతి పత్రాలు అతని వద్ద లేవు. గుట్టు చప్పుడు కాకుండా రవి కుమార్ తుపాకిని తన దగ్గర భద్రపర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మంచాల ఎస్సై యాదగిరి నాటు తుపాకిని స్వాధీనం చేసుకొని రవి కుమార్‌ను అరెస్టు చేశారు.
 

మరిన్ని వార్తలు