వన్యప్రాణుల గణన పూర్తి

1 Feb, 2018 15:50 IST|Sakshi
ఆసిఫాబాద్‌ డివిజన్‌లో జంతువుల గణన చేస్తున్న అధికారులు

1.76 లక్షల చదరపు కిలోమీటర్లలో సేకరణ

రెండు విడుతల్లో 500 మంది సిబ్బందితో గణన

జిల్లాలో రెండు చోట్ల పులి అడుగులు

డివిజన్‌ల వారీగా ప్రక్రియ

జన్నారం(ఖానాపూర్‌) : మంచిర్యాల జిల్లాలో జనవరి 22 నుంచి ప్రారంభంనుంచి ప్రారంభమైన వన్యప్రాణుల గణన పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే గణనలో శాఖహార, మాంసహార జంతువులను లెక్కిస్తారు. రెండు విడుతల్లో జిల్లా వ్యాప్తంగా 1లక్ష76 వేల 100 చదరపు కిలోమీటర్లతో పాటు కవ్వాల్‌ టైగర్‌జోన్‌లోని 892.23 చదరపు కిలోమీటర్ల కోర్‌ ఏరియా, 1123.12 చదరపు కిలోమీటర్ల బఫర్‌ ఏరియాలోని అటవీ ప్రాం తంలో వన్యప్రాణుల గణన జరిగింది. మంచి ర్యాల జిల్లాలోని జన్నారం, మంచిర్యాల, చె న్నూరు, బెల్లంపల్లి అటవీడివిజన్‌లలో 195 బీట్‌లలో 400 మంది అటవిశాఖ సిబ్బందితో పాటు వందమంది వరకు కళాశాల విద్యార్థులు, హైదరాబాద్‌లోని ఫారెస్ట్‌ కళాశాల సిబ్బంది పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు.

రెండు విడుతలుగా గణన
జనవరి 22 నుంచి 24 వరకు  మాంసహార జం తువులను 27 నుంచి 29 వరకు శాఖహార జం తువులను లెక్కించారు. ఒక్కో బీట్‌కు ఒక బృం దం చొప్పున నియమించారు.బీట్‌ పరిధిలో బీట్‌ అధికారితో పాటు బేస్‌క్యాంపు సిబ్బంది, స్టూడెంట్‌ను అధికారులకు జత పరిచారు.

ఎలా లెక్కించారంటే...
జిల్లాలో ఎకలాజికల్‌ యాప్‌ ద్వారా వన్యప్రాణుల వివరాలను సేకరించి,  క్షేత్రస్థాయి నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రతిరోజు ఉద యం అడవిలో తిరుగుతూ అడుగుల ద్వారా, అ ధికారులు ఏర్పాటు చేసుకున్న 2 కి.మీ ట్రాన్సెక్ట్‌ పాయింట్‌ ద్వారా వన్యప్రాణుల గణన చేపట్టారు. ఈ పాయింట్‌ పరిధిలో సంచరించే జం తువుల వివరాలను సేకరించి యాప్‌లో అడిగిన విధంగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వన్యప్రాణుల మల విసర్జన, వెంట్రుకలు, అరుపులు, కాలిముద్రల ఆధారంగా జంతువుల గణన ని ర్వహించారు. నీటిగుంతల వద్ద కాలిముద్రలను ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో అచ్చులను సేకరించి ఆరబెట్టిన అనంతరం వాటి జాతి ఆడ, మగ, వాటి ఎత్తు, బరువు, వయస్సు నిర్దారిస్తారు.

జిల్లాలో రెండు చోట్ల పులి అడుగులు
 జిల్లాలో గణన సందర్భంగా రెండు చోట్ల పులి అడుగులను, ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధి లోని ఖానాపూర్‌ డివిజన్‌లోని  కోర్‌ ఏరియా ప్రాంతంలో ఒకచోట పులి అడుగు కనిపించినట్లు, చెన్నూరు డివిజన్‌ నీల్వాయి ప్రాంతంలో మరో పులి అడుగుతో పాటు అరుపులు కూడ వినిపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆసిఫాబాద్‌ డివిజన్‌లో రెండు పులులున్నట్లు అధికారులు అడుగుల ద్వారా గుర్తించారు. జిల్లాలో సుమారుగా 20 వరకు చిరుతలున్నట్లు గుర్తించినట్లు అధికారుల ద్వారా తెలిసింది.

జన్నారం డివిజన్‌లో కానరాని పులి అడుగులు
ఇందన్‌పల్లి, తాళ్లపేట్‌ రేంజ్, జన్నారం అటవీరేంజ్‌లలో ఆరుచోట్ల చిరుతపులి అడుగులు, ఆనవాలు కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎలుగుబంట్లు, రేసుకుక్కలు, తోడేళ్ల స ంఖ్య పెరిగినట్లు చెబుతున్నారు. శాఖహార జం తువులు అడవి దున్నలు, నీలుగాయి, చుక్కల దుప్పులు, సాంబర్, మెకాలు, గడ్డి జింకలు, కొండగొర్రెలు, అడవి పిల్లులు, కుందేళ్లు తదితర వాటిని అధిక సంఖ్యలో చూసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే జంతువుల సంఖ్య మాత్రం చెప్పలేకపోతున్నారు.

లెక్క ఎప్పుడు తేలుతుంది?
అధికారులు చేసిన గణనలో లెక్క ఎప్పుడు తే లుతుందనేది స్పష్టంగా చెప్పడం లేదు. యాప్‌ద్వారా ఆన్‌లైన్‌లో నమోదైన వన్యప్రాణుల వివరాలు డివిజన్‌ వారిగా డెహ్రడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపుతారు. ప్రస్తుతం డివిజన్‌లోని వివిధ బీట్‌ల వారిగా వివరాలను సేకరిస్తున్నారు. ఫిబ్రవరి రెండోవారంలో ఇన్‌స్టిట్యూట్‌కు పంపిస్తే అక్కడ ఏప్రాంతంలో ఏ జం తువులు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తిస్తారు. పూర్తి వివరాలు మార్చి చివరివారం లేదా ఏప్రిల్‌లో  వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.

వణ్యప్రాణుల గణన విజయవంతంగా పూర్తి చేశాం. అటవీ అధికారులతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీవోలు పాల్గొన్నారు. ప్రత్యేక మోబైల్‌యాప్‌ లో నమోదు చేయడం వల్ల ఇప్పుడు పూర్తి సంఖ్య చెప్పలేకపోతున్నాం. ప్రస్తుతం డివిజన్‌ల వారిగా వివరాలను సేకరించి డెహ్రడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపిస్తాం.    – రామలింగం, జిల్లా అటవీసంరక్షణ అధికారి

మరిన్ని వార్తలు