పులి వచ్చిందా.. అయితే పట్టేయొచ్చు..!

1 May, 2020 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వన్యప్రాణుల ట్రాకింగ్‌కు ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌ను వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) శాస్త్రవేత్తలు రూపొందించారు.కోవిడ్‌ –19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యా ప్తంగా పలుప్రాంతాల్లో అడవుల్లోంచి వన్యప్రాణులు, జంతువులు రోడ్లపైకి, జనావాసాలకు దగ్గరగా వస్తున్న విషయం తెలిసిందే.ఎక్కడికక్కడ వాటిని ట్రాక్‌ చేయడంతో పాటు, వాటి ఆనుపానులు తెలుసుకునేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.అదేవిధంగా దేశంలోని వివి ధ రాష్ట్రాల్లో మనుషులు,జంతువులు తారసపడుతున్న ప్రాంతాలు, అక్కడున్న పరిస్థితులను తెలుసుకునేందుకు అవసరమైన ము ఖ్యమైన సమాచారాన్ని దీని ద్వారా పొందవచ్చునంటున్నారు

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ‘లాక్‌డౌన్‌ వైల్డ్‌లైఫ్‌ ట్రాకర్‌’ను వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) రూపొందించింది. దేశవ్యాప్తంగా అడవులు, దగ్గర్లలోని గ్రామా లు, పట్టణాల్లో ఎక్కడెక్కడ ఏ రకమైన వ న్యప్రాణులు, జంతువులు కనిపించాయో రికార్డ్‌ చేసేందుకు వీలుగా ఇందులో టూ ల్స్‌ను వినియోగిస్తున్నారు.  లాక్‌డౌన్‌ సందర్భంగా ఇక్కడ పులి కనిపించింది, అక్కడ ఏనుగులు రోడ్లపైకి వచ్చాయి, మరోచోట చిరుతపులి ఊళ్లోకి వచ్చింది అంటూ వస్తు న్న వార్తలు, వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న కథనాలు, ఫోటోలు కేవలం ఆ మేరకే పరిమితం కాకుండా, దీనికి సంబంధించిన డేటాను సమీకృతంగా సేకరించి వన్యప్రాణులకు చెందిన ఆసక్తికరమైన సమాచారాన్ని నమోదు చేయొచ్చనే ఆలోచనతో డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలు ఈ యాప్‌ను రూపొందించారు.

ఎప్పుడైనా రికార్డు చేయవచ్చు... 
పట్టణప్రాంతాలతో పాటు మనుషులు ఎక్కువగా లేని చోట్లకు జంతువులు కూడా వస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తమకు కనిపించిన వాటి గురించి ఈ యాప్‌ ద్వారా తెలియజేయొచ్చని ఈ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ మోహన్‌ తెలిపారు. వన్యప్రాణులు కనిపిస్తే అదే సమయంలో లేకుంటే ఆ తర్వాతైనా తెలియజేయొచ్చని, వాటి ఫొటోలను అప్‌లోడ్‌ చేయొచ్చని డబ్ల్యూఐఐ సీనియర్‌ సైంటిస్ట్‌ డా.బిలాల్‌ హబీబ్‌ తెలిపారు. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, దీనిద్వారా తమకు కనిపించిన జంతువు ల చిత్రాలను ఎక్కడినుంచైనా, ఏ సమయం లోనైనా రికార్డ్‌ చేసి పంపొచ్చునని తెలియజేశారు.ఈ రికార్డింగ్‌లను సులభంగా చేయడంతో పాటు జీపీఎస్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుందన్నారు.ఈ సమాచారం, ఫొటోలను సంబంధిత రాష్ట్రాల అటవీశాఖలకు పంపించి, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణను చేపట్టేందుకు వీలవుతుందని మోహన్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు